IND vs BAN: నేటి నుంచి బంగ్లా-భారత్ తొలి టెస్ట్ మ్యాచ్.. కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!

ఇండియా, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య నేటి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. దీనికి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. ఉదయం 9 గంటలకు తొలి టెస్టు ప్రారంభంకానుంది.

  • Written By:
  • Publish Date - December 14, 2022 / 08:09 AM IST

ఇండియా, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య నేటి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. దీనికి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. ఉదయం 9 గంటలకు తొలి టెస్టు ప్రారంభంకానుంది. మరోవైపు రోహిత్, షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఇండియా బరిలోకి దిగుతుంది. కాగా బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీకి ఈ మ్యాచ్‌ (IND vs BAN) పరీక్ష కానుండగా.. విరాట్‌ కోహ్లీ, పుజారా, పంత్‌పై అందరి చూపు నిలువనుంది. గాయపడ్డ రోహిత్‌ స్థానంలో యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం దక్కుతుందా.. లేక బంగ్లా ఏతో అనధికారిక టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన అభిమన్యు ఈశ్వరన్‌ ఓపెనింగ్‌ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

పుష్కర కాలం తర్వాత జట్టులోకి వచ్చిన జైదేవ్‌ ఉనద్కట్‌ వీసా కారణాలతో బంగ్లాదేశ్‌కు చేరుకోలేకపోగా.. మహమ్మద్‌ సిరాజ్‌తో పాటు ఉమేశ్‌ యాదవ్‌ పేస్‌ భారాన్ని మోయనున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా.. పిచ్‌ పరిస్థితులను బట్టి ఐదో బౌలర్‌ను ఎంపిక చేయనున్నారు. మరోవైపు షకీబ్‌, ముష్ఫికర్‌, లిటన్‌దాస్‌ లాంటి ఆటగాళ్లతో బంగ్లా కూడా బలంగానే ఉంది.

Also Read: FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో ఫైనల్‌ కు చేరిన అర్జెంటీనా..!

జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అత్యంత అనుకూలం. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్లకు ఈ పిచ్‌‌పై సునాయాసంగా పరుగులు చేయగలరు. స్పిన్‌కు కూడా ఈ పిచ్ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ కీలకం కానున్నారు. చటోగ్రామ్ వాతావరణ నివేదికల ప్రకారం నేడు ప్రారంభం కాబోయే తొలి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం 2 శాతం మాత్రమే.

భారత టెస్టు జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మహ్మదుల్లా, లిటన్ దాస్, ఖలీద్ అహ్మద్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, నూరుల్ హసన్, ఇబాత్ హుస్సేన్, మోమినుల్ హక్, మెహందీ హసన్ మీర్జా, షరీఫుల్ ఇస్లాం, యాసిర్ అలీ, తైజుల్ ఇస్లాం, జకీర్ హసన్, ముష్ఫిక్ హసన్, తస్కిన్ అహ్మద్, రెహ్మాన్ రజా, అనాముల్ హక్.