IND vs BAN 2nd Test Day1: కాన్పూర్(Kanpur)లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ మరియు బంగ్లాదేశ్(IND vs BAN) మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌లో తొలిరోజు వర్షం ప్రభావం చూపింది. తొలుత ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ఆ తర్వాత అడపాదడపా సాగింది. ప్రతికూల వాతావరణం కారణంగా తొలి రోజు మ్యాచ్ ని మధ్యలోనే రద్దు చేసింది బీసీసీఐ. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 107/3. అయితే రెండో రోజు కూడా ఇదే వాతావరణం కొనసాగుతోంది. వాస్తవానికి అక్కడ శనివారం వర్షం(Rain) పడే అవకాశం 80% ఉందని ఐఎండీ(IMD) తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో రోజు కూడా మ్యాచ్ జరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం కాన్పూర్ లో ఉష్ణోగ్రత 31 నుండి 25 డిగ్రీల వరకు ఉంటుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది.
బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ , జడేజాల జోడి అద్భుతంగా రాణించింది. రెండో ఇన్నింగ్స్ లో పంత్, గిల్ చెలరేగి ఆడారు. అటు అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టి బాంగ్లాదేశ్ బ్యాటర్ల వెన్నుసిరిచాడు. బుమ్రా, ఆకాష్ దీప్ , జడేజాలు వికెట్ల వేట కొనసాగించి కట్టడి చేశారు.
టీమిండియా జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ జట్టు: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.
Also Read: Devara Release : ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్