Site icon HashtagU Telugu

Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

Pitch Report

Pitch Report

Pitch Report: చారిత్రక గ‌బ్బా మైదానంలో టీమ్ ఇండియా మరోసారి ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈసారి ఇది టీ20 ఫార్మాట్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు సిరీస్‌లోని ఐదవ, చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో (Pitch Report) పోటీపడనుంది. ఈ గ్రౌండ్‌తో టీమ్ ఇండియాకు కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సిరీస్‌ను తమ సొంతం చేసుకునే లక్ష్యంతో మైదానంలోకి అడుగుపెట్టనుంది. నాలుగో టీ20లో జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా భారత బౌలర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. మరోవైపు కంగారూ జట్టు సిరీస్‌ను సమం చేసి మెరుగైన ముగింపు ఇవ్వాలని కోరుకుంటోంది.

గ‌బ్బా పిచ్ ఎలా ఆడనుంది?

బ్రిస్బేన్‌లోని గ‌బ్బా మైదానాన్ని ఫాస్ట్ బౌలర్‌లకు స్వర్గధామంగా భావిస్తారు. ఈ గ్రౌండ్ ఆస్ట్రేలియాలోని అత్యధిక బౌన్స్ ఉన్న పిచ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. మేఘావృతమైన పరిస్థితులు ఉంటే ఇక్కడ బంతి బాగా స్వింగ్ కూడా అవుతుంది. ప్రారంభ ఓవర్లలో గ‌బ్బాలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన పని. అయితే బ్యాక్‌ఫుట్‌లో బాగా ఆడే బ్యాట్స్‌మెన్‌లు ఇక్కడి బౌన్స్ పిచ్‌పై అద్భుతమైన ప్రదర్శన చేయగలరు. ఈ మైదానంలో ఔట్‌ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. దీని కారణంగా బ్యాట్స్‌మెన్‌లు క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత ఫోర్లు, సిక్సర్లు బాదవచ్చు. మొత్తంగా చూస్తే గ‌బ్బాలో బ్యాట్, బంతి మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోరాటం చూడటం ఖాయం.

Also Read: Diesel Cars: పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ బెస్ట్ ఎందుకు?

బుమ్రాకు విశ్రాంతి లభిస్తుందా?

జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు టీ20 మ్యాచ్‌లలో కనిపించాడు. అందువల్లచ చివరి మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుమ్రాకు రెస్ట్ ఇస్తే హర్షిత్ రాణాకు ప్లేయింగ్ 11లో అవకాశం దొరకవచ్చు.

ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అందులో బుమ్రా కూడా జట్టులో సభ్యుడు. ఈ కారణంగానే బుమ్రాకు విశ్రాంతినిచ్చే ఆలోచన చేయవచ్చు. శివమ్ దూబే స్థానంలో ఫిట్‌గా ఉన్న నితీష్ కుమార్ రెడ్డిని కూడా తుది జట్టులో ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచించవచ్చు.

టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా)

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్/సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా.

Exit mobile version