Site icon HashtagU Telugu

IND vs AUS 4th Test: మెల్‌బోర్న్‌ టెస్టుకు వర్షం ముప్పు.. కంగారు పెడుతున్న వెదర్ రీపోర్ట్!

Ind Vs Aus 4th Test Weather Report

Ind Vs Aus 4th Test Weather Report

IND vs AUS 4th Test: భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో నిలవడానికి భారత్, ఆస్ట్రేలియాకు నాలుగో టెస్ట్ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇరు జట్లు తమ తుది జట్టుపై ఫోకస్ పెడ్తున్నాయి. ఈ నేపథ్యంలో తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌పై వాతావరణం ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖ ప్రకారం డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో ఉష్ణోగ్రత ఎండగా ఉంటుంది, ఉష్ణోగ్రత 36 నుండి 40 మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తరం నుండి ఈశాన్య దిశగా గంటకు 20 నుండి 30 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, సాయంత్రం పశ్చిమ దిశలో గంటకు 15 నుండి 25 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం మెల్‌బోర్న్‌లో 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుండి గంటకు 25 నుండి 35 కి.మీ వేగంతో గాలి వీస్తుంది, ఇది పగటిపూట నైరుతి దిశ నుండి గంటకు 20 నుండి 30 కి.మీ వేగంతో వీస్తుంది. దీని తర్వాత మరో మూడు రోజుల పాటు ఎండలు ఎక్కువగా ఉంటాయి. తేలికపాటి మేఘాలు కూడా ఉంటాయి.

మెల్‌బోర్న్‌లో భారత జట్టు గణాంకాలు కంగారూ జట్టును భయపెట్టబోతున్నాయి. గత 13 ఏళ్లుగా మెల్‌బోర్న్‌లో భారత జట్టు ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 2011 డిసెంబర్‌లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా 122 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఆ తర్వాత ఈ మైదానంలో ఇరు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో టీమ్ ఇండియా 2 గెలిచి, 1 మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుత సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలు ఒక్కో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాయి. పెర్త్‌లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్ భారత్ పేరిటే నమోదైంది. అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఖాతాలోకి వెళ్ళిపోయింది. వర్షం కారణంగా గబ్బా టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది.