Site icon HashtagU Telugu

IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

IND vs AUS

IND vs AUS

IND vs AUS: టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా (IND vs AUS) ముందు విజయానికి 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో మిచెల్ మార్ష్, మాథ్యూ షార్ట్ ఆస్ట్రేలియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మార్ష్ క్రీజులో ఉన్నంతవరకు ఆతిథ్య జట్టు పటిష్టంగా కనిపించింది. అయితే స్ట్రేలియా కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్ 46 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. చివరికి ఆస్ట్రేలియా బౌలర్లు బాగా పుంజుకున్నారు. భారత ఇన్నింగ్స్ 167 పరుగులకు ముగిసింది.

మ్యాచ్‌కి అతిపెద్ద టర్నింగ్ పాయింట్

మ్యాచ్‌కి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ మిచెల్ మార్ష్ వికెట్. ఎందుకంటే ఆయన అప్పటికే మంచి ఫామ్‌లో కనిపించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ క్రీజులో ఉన్నంతవరకు ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. మార్ష్ వికెట్‌ను శివమ్ దూబే తీయగా.. ఆ తర్వాత ఆయన టిమ్ డేవిడ్ కీలకమైన వికెట్‌ను కూడా తీసుకున్నారు.

గేమ్ ఛేంజర్‌గా శివమ్ దూబే

మార్ష్- షార్ట్ మొదటి వికెట్‌కు 37 పరుగులు, ఆ తర్వాత ఇంగ్లిస్- మార్ష్ మధ్య 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్ష్ క్రీజులో ఉండగా ఆస్ట్రేలియా విజయం వైపు దూసుకుపోతున్న తరుణంలో శివమ్ దూబే గేమ్ ఛేంజర్‌గా వచ్చారు. దూబే మార్ష్‌ను క్యాచ్ అవుట్ చేయగా, ఆ తర్వాత టిమ్ డేవిడ్‌ను కూడా అవుట్ చేశాడు.

Also Read: Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల వికెట్లు వరుసగా పడటం మొదలైంది. జోష్ ఫిలిప్‌ను అర్ష్‌దీప్ సింగ్ బౌల్డ్ చేయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతన్ని వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేయగా, స్టోయినిస్ కొంత పోరాడినప్పటికీ అది ఎక్కువసేపు కొనసాగలేదు. వాషింగ్టన్ సుందర్ స్టోయినిస్‌ను బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు ఆఖరి ఆశను కూడా ముగించాడు.

అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 

నాలుగో టీ20లో బ్యాటింగ్, బౌలింగ్‌లలో అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పటేల్ బ్యాటింగ్‌లో 21 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బౌలింగ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన తొలి 2 వికెట్లను తీశారు. ఆయన తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చారు.

Exit mobile version