IND vs AUS 3rd T20I: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో (IND vs AUS 3rd T20I) భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 186 పరుగులు చేయగా.. దానికి బదులుగా టీమ్ ఇండియా 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసింది.
టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్‌ల అర్ధ సెంచరీల సహాయంతో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 186 పరుగుల స్కోరును నమోదు చేసింది. డేవిడ్ 74 పరుగులు చేయగా, స్టోయినిస్ 64 పరుగుల తోడ్పాటును అందించాడు. ఇక బౌలింగ్‌లో భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అతను 3 వికెట్లు తీసుకున్నాడు.
Also Read: 21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!
వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్
ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా తరఫున అభిషేక్ శర్మ మరోసారి తుఫాను బ్యాటింగ్‌తో అలరించాడు. కానీ 25 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఫామ్ ఇంకా మెరుగుపడలేదు. అతను కేవలం 15 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులో స్థిరపడ్డాడు. 11 బంతుల్లో 24 పరుగులు చేసినప్పటికీ దాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. నం.4 బాధ్యతను అందుకున్న తిలక్ వర్మ 29 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్‌కు కూడా మంచి ఆరంభం లభించినా 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
భారత్ 111 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను ధాటిగా బ్యాటింగ్ చేస్తూ కేవలం 23 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మరొక వైపు జితేష్ శర్మ నాటౌట్‌గా 22 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ఇండియా విజయాన్ని ఖాయం చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ముగియగా, భారత్- ఆస్ట్రేలియా చెరో ఒక్క విజయం సాధించి సమంగా నిలిచాయి.
