IND vs AFG 1st T20: మొహాలీలో తొలి టి20 మ్యాచ్.. పిచ్ హిస్టరీ

భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (IND vs AFG) నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనుంది.

IND vs AFG 1st T20: భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (IND vs AFG) నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లి భారత జట్టులోకి తిరిగి వచ్చారు. అయితే విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కోహ్లీ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది.

కొత్త సంవత్సరంలో టీమిండియాకు ఇది తొలి సిరీస్. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా 2024 సంవత్సరంలో మొదటి సిరీస్ లో ఆడుతుంది. అంతేకాదు టి20 ప్రపంచకప్ కు ముందు ఇరు జట్లు తలపడేది కూడా ఇదే చివరి సిరీస్ లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లూ ఈ సిరీస్‌ని విజయంతో ప్రారంభించాలని భావిస్తున్నాయి. భారత జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మ చేతిలో ఉండగా, ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్సీ వహించనున్నాడు.

టి20 ఇంటర్నేషనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటివరకు మొత్తం 5 సార్లు తలపడ్డాయి. ఈ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో రోహిత్ సేన విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక పిచ్ విషయానికి వస్తే.. మొహాలీ పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఈ మైదానంలో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా కనపడుతుంది. ఈ మైదానం అవుట్‌ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉంటుంది, దీని కారణంగా బంతిని బౌండరీ లైన్‌కు పంపడం సులభం అవుతుంది. అయితే, పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. మొహాలీ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 9 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 5 గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 168 కాగా, రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 152. మంచు దృష్ట్యా టాస్‌ గెలిచిన కెప్టెన్ మరో ఆలోచన లేకుండా మొదట బౌలింగ్‌ ఎంచుకుంటాడు.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఉమర్‌జాయ్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఖైస్ అహ్మద్/. హెచ్‌ఎన్ ఎఫ్‌క్ అహ్మద్

Also Read: Guntur Karam RRR Record Break : రోజుకి 41 షోలు.. RRR కే వేయలేదు.. మహేష్ గుంటూరు కారం రికార్డు..!