IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం

మొహాలీలో భారత్ ,ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు.

IND vs AFG 1st T20: మొహాలీలో భారత్ ,ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. ఆఫ్ఘానిస్తాన్ తరుపున ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శివమ్ దూబే అజేయంగా 60 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జితేష్ శర్మ 31 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.ఛేదనలో భారత్ కు పేలవమైన ఆరంభం లభించింది. తొలి ఓవర్ రెండో బంతికే రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ 23 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ 26 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ఘనిస్థాన్‌ ఇన్నింగ్స్ లో మహ్మద్ నబీ 27 బంతులు ఎదుర్కొని 42 పరుగులు చేశాడు.నబీ స్ట్రైక్ రేట్ 155 తో రాణించాడు. భారత్ తరఫున ముఖేష్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీయగా, శివ్ దూబే ఒక వికెట్ తీసుకున్నాడు.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్.

ఆఫ్ఘనిస్థాన్ జట్టు: హమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్‌హక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్.

Also Read: Raw Coconut: పచ్చికొబ్బరి తింటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి..