IND Beat SL: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో విజయం (IND Beat SL) భారత్‌నే వరించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న లంక జట్టు భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 137 పరగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ బ్యాటింగ్‌లో శుభమన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), వాషింగ్టన్ సుందర్ (25) మినహా మరే టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణించలేదు. దీంతో టీమిండియా కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బౌలింగ్‌లో తీక్షణ, హసరంగా చెరో రెండు వికెట్లు తీశారు.
అయితే 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ నెమ్మదిగా చేసిన ఆ తర్వాత జోరు పెంచింది. జట్టు స్కోర్ 117 వరకు అద్భుతంగా ఆడిన లంక జట్టు ఆ తర్వాత వికెట్లు కోల్పోవటం ప్రారంభించింది. ఒకానొక దశలో మరో నాలుగు ఓవర్లు ఉండగానే మ్యాచ్ గెలిచేస్తారు అనే దగ్గర నుంచి లాస్ట్ ఓవర్ చివరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చారు. 117 పరుగుల వద్ద నుంచి లంక బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలవలేకపోయారు. భారత బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తక్కువ స్కోర్‌ని అద్భుతంగా డిఫెండ్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో లంక జట్టు కూడా 8 వికెట్ల నష్టానికి 137 పరగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే అనూహ్యంగా బౌలింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కడం ఇక్కడ గమనించదగ్గ విషయం. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు.
Also Read: Olympics: ఒలింపిక్స్‌లో మను భాకర్ కంటే ముందు రెండు పతకాలు సాధించిన భారతీయుడు ఎవరంటే..?
సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం
సూపర్ ఓవర్‌లో శ్రీలంకను భారత్ ఓడించింది. భారత్ గెలవాలంటే 3 పరుగులు చేయాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌లు టీమిండియా బ్యాటింగ్‌కు దిగారు. మహిష్ తీక్షణ వేసిన తొలి బంతికే ఫోర్ కొట్టి సూర్యకుమార్ యాదవ్ జట్టుకు విజయం అందించాడు. అయితే తొలుత సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ 6 బంతులు కూడా ఆడలేకపోయారు. తొలి 3 బంతుల్లో 2 పరుగులు చేసి ఆతిథ్య శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లిద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో భారత్ విజయం సాధించాలంటే 6 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
భారత్ జట్టు: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిందు మెండిస్, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), చమిందు విక్రమసింఘ, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, మతిషా పతిరనా, అసిత ఫెర్నాండో, రమేష్ మెండిస్.