Site icon HashtagU Telugu

Women IPL: మార్చి 4 నుంచే మహిళల ఐపీఎల్

Bcci Plans Six Team Womens Ipl Next Year

Bcci Plans Six Team Womens Ipl Next Year

మహిళల క్రికెట్ లో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. మహిళల ఐపీఎల్ (Women IPL) తొలి సీజన్ కోసం బీసీసీఐ తన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే మహిళల ఐపీఎల్ కు సంబంధించి ఫ్రాంచైజీల ఎంపిక, ప్లేయర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన బోర్డు తాజాగా తొలి సీజన్ తేదీలను కూడా ఖరారు చేసింది. అంతా ఊహించినట్టుగానే మార్చిలో వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభం కానుంది. లీగ్ ఛైర్మన్ అరుణ్ ధమాల్ పీటీఐకి వివరాలు వెల్లడించారు.

మార్చి 4 నుంచి 26 వరకూ మహిళల ఐపీఎల్ తొలి సీజన్ జరుగుతుందని ప్రకటించారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలో ఆతిథ్యమివ్వనున్నాయి. ఆరంభ సీజన్ లో 22 మ్యాచ్ లు జరగనుండగా.. లీగ్ స్టేజ్ లోటాప్ ర్యాంక్ లో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడతాయి.

Also Read: Coconut: ఆడవాళ్లు కొబ్బరికాయ కొట్టకూడదా.. కొడితే ఏం జరుగుతుందో తెలుసా?

ఇదిలా ఉంటే ఇటీవలే ఫ్రాంచైజీల అమ్మకం ద్వారా బీసీసీఐ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని రాబట్టింది. ఐదు ఫ్రాంచైజీలు కలిపి 4,670 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక మీడియా హక్కుల అమ్మకం ద్వారా 951 కోట్లు ఆర్జించింది. ఇక ప్లేయర్స్ వేలం ఫిబ్రవరి 13న జరగనుంది. వేలంలో పాల్గొనేందుకు 1500 మంది ప్లేయర్స్ రిజిష్టర్ చేసుకున్నారు. ఫైనల్ లిస్ట్ ఈ వారాంతంలో వచ్చే అవకాశముంది. కాగా ఒక్కో టీమ్ ప్లేయర్స్ కోసం గరిష్టంగా 12 కోట్ల వరకూ వెచ్చించేందుకు వీలుంది. ఒక్కో ఫ్రాంచైజీ కనీసం 15 మంది , గరిష్టంగా 18 మంది వరకూ కొనుగోలు చేయొచ్చు. మరోవైపు సీజన్ ఆరంభ మ్యాచ్ లో అదానీ, అంబానీ జట్లు తలపడే అవకాశాలున్నాయి.