China Vs India : ఆసియా గేమ్స్ లో చైనా 270.. ఇండియా 60

China Vs India :  చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

Published By: HashtagU Telugu Desk
Telugu Players Asian Games

Telugu Players Asian Games

China Vs India :  చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకు భారత్ 60 మెడల్స్ ను సాధించింది. వాటిలో 13 గోల్డ్ మెడల్స్, 24 రజత పతకాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు చైనా పతకాల పట్టికలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఆ దేశం ఇప్పటికే 270 మెడల్స్ ను కైవసం చేసుకుంది. వాటిలో సగాని కంటే ఎక్కువ (147) గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం. ప్రతిభావంతులైన  క్రీడాకారుల ఎంపిక నుంచి  అత్యున్నత ప్రమాణాలతో కూడిన ట్రైనింగ్ దాకా అన్నింటా చైనా చేసే కసరత్తు ప్రభావం ఆసియా క్రీడల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి గత 40ఏళ్లుగా ఆసియా క్రీడల్లో మకుటంలేని మహారాజుగా చైనా వెలుగొందుతోంది. ఐదేళ్ల క్రితం ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరిగిన 18వ ఆసియా క్రీడల్లోనూ చైనా 132 స్వర్ణాలు సహా 300 పతకాలు చేజిక్కించుకొని అగ్రస్థానంలో నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join

ఇక పతకాల పట్టికలో రెండో స్థానంలో జపాన్ ఉంది. ఆ దేశం ఇప్పటివరకు  122 పతకాలను సాధించింది. ఇక మూడో ప్లేస్ లో ఉన్న కొరియా 133 పతకాలను సాధించింది. అయితే ఇది సాధించిన గోల్డ్ మెడల్స్ సంఖ్య, జపాన్ గోల్డ్ మెడల్స్ కంటే తక్కువగా ఉండటంతో మూడో స్థానానికి పరిమితమైంది. సోమవారం రోజు భారత్ మొత్తం 7 పతకాలను కైవసం చేసుకుంది. ఇక భారత హాకీ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెమీ ఫైనల్స్ ఆడేందుకు భారత జట్టు ఈరోజు రంగంలోకి దిగనుంది. సెమీస్‌లో భారత జట్టుకు ఆతిథ్య చైనా నుంచి పెద్ద సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈసారి ఆసియా గేమ్స్ లో ఎలాగైనా కనీసం 100 పతకాలను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఎంతమేరకు ఫలితాలను సాధిస్తుందో వేచిచూడాలి.

Also read : Gold- Silver Price: మహిళలకు శుభవార్త.. మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..!

  Last Updated: 03 Oct 2023, 07:39 AM IST