Bodybuilder Illia Yefimchyk: ప్రపంచంలోని అగ్రశ్రేణి బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి

Bodybuilder Illia Yefimchyk: ప్రపంచంలోని అగ్రశ్రేణి బాడీబిల్డర్ గుండెపోటు కారణంగా మరణించాడు, వయస్సు కేవలం 36 సంవత్సరాలు. ఇలియా మృతి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది

Published By: HashtagU Telugu Desk
Illia Yefimchyk

Illia Yefimchyk

Bodybuilder Illia Yefimchyk: ప్రపంచంలోని అత్యంత భయంకరమైన బాడీబిల్డర్ గా గుర్తింపు పొందిన ఇలియా యెఫిమ్‌చిక్(Yefimchik) గుండెపోటుతో మరణించారు. కేవలం 36 ఏళ్ల వయసులో ఇలియా మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించే విషయమే అయినా, సామాన్యులకు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ 6న యెఫిమ్‌చిక్‌కు గుండెపోటు(Heart Atack) వచ్చి కోమాలోకి వెళ్ళాడు. సెప్టెంబరు 11 వరకు అతనికి చికిత్స కొనసాగింది. సెప్టెంబర్ 11 న ఇలియా యెఫిమ్‌చిక్ మరణించాడు. గత రెండు రోజులుగా గుండె కొట్టుకోవడం ప్రారంభించినా డాక్టర్లు అతడిని కాపాడలేకపోయారు.

ఇలియా యెఫిమ్‌చిక్ కఠినమైన వ్యాయామంతో 25-అంగుళాల కండరపుష్టిని నిర్మించాడు. రోజుకు 16,500 కేలరీలు వరకు వినియోగించారు.రోజు 2.5 కేజీ మాంసం మరియు 100 కంటే ఎక్కువ సుషీ ముక్కలను ఆహారంలో చేర్చేవాడు. అయితే అతను ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్ పోటీలలో ఎప్పుడూ పాల్గొననప్పటికీ, సోషల్ మీడియాలో అతను చురుకుగా ఉండేవాడు. రోజు తన వీడియోలను పంచుకునేవాడు. అతని వీడియోలకు ఎంతోమంది అభిమానులున్నారు. అతను 600 పౌండ్ల బెంచ్ ప్రెస్, 700 పౌండ్ల డెడ్‌లిఫ్ట్ మరియు 700 పౌండ్ల స్క్వాట్‌లతో సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇలియా యెఫిమ్చిక్ చాలా బలమైన శరీరాకృతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కలిగిన వ్యక్తి. అతను గుండెపోటుతో మరణించడం షాకింగ్ అనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా అతని మరణ వార్త తెలిసింది. ఫిట్‌గా కనిపించడానికి, అంతర్గతంగా ఫిట్‌గా ఉండటానికి చాలా తేడా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Also Read: AP Cabinet : 18న ఏపీ కేబినెట్ భేటి..కీలక అంశాలపై చర్చలు

  Last Updated: 13 Sep 2024, 04:25 PM IST