Rohit Sharma: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నిరంతరం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీమ్ ఇండియా చివరిసారిగా 2013లో ఐసిసి ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత గత దశాబ్ద కాలంగా భారత్ ఓటమిని మాత్రమే రుచి చూస్తోంది. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోవడంతో టీమ్ ఇండియా కెప్టెన్సీని మార్చాలనే డిమాండ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ తన కెప్టెన్సీని కాపాడుకోవాలంటే 3 విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.
ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ
వయసు పెరుగుతున్న కొద్దీ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కూడా అతనికి పెద్ద సమస్యగా మారింది. మైదానంలో రోహిత్ శర్మ పేరు ఎంత ఉందో, అదే విధంగా ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా అంతే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ తన నుంచి కెప్టెన్సీని వదులుకోకూడదు అనుకుంటే.. అందుకు వర్కవుట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనకు రోహిత్ శర్మ ఫిట్‌నెస్ తో ఉండాల్సిన అవసరం ఉంది.
Also Read: ACC Emerging Asia Cup 2023: మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్ భారత్‌దే
ఫామ్ లోకి రావాలి
రోహిత్ శర్మ ఫామ్ టీమ్ ఇండియాకు తలనొప్పిగా మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో కూడా రోహిత్ బ్యాట్‌తో అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ తొందరగానే ఔటయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్ కోసం అతను తన పాత ఫామ్‌కు రావాల్సిన అవసరం ఉంది.
ఒత్తిడి లేకుండా చూసుకోవాలి
మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండటం వల్ల రోహిత్ శర్మపై చాలా ఒత్తిడి ఉంది. కానీ ఒత్తిడి దేనినీ పరిష్కరించదు. ప్రశాంతంగా, కూల్ మైండ్ తో మ్యాచ్ లో నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో హిట్ మ్యాన్ ఈ మూడు విషయాలపై శ్రద్ధ పెడితే అతడి నుంచి టీమిండియా కెప్టెన్సీని ఎవరూ లాక్కోలేరు.