Site icon HashtagU Telugu

Female Fan: నా భర్తకు విడాకులు ఇస్తా.. ఆర్సీబీపై భారం వేసిన లేడీ ఫ్యాన్!

Female Fan

Female Fan

Female Fan: RCB అభిమానులు క‌ప్ కోసం ర‌క‌ర‌కాల ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. వారి అద్భుతమైన, వింతైన చేష్టలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మహిళా అభిమాని (Female Fan) ఫోటో చర్చల కేంద్రంగా మారింది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మహిళా అభిమాని చెప్పినది ఏమిటంటే.. ఒకవేళ బెంగళూరు జట్టు ఫైనల్ మ్యాచ్ గెలవకపోతే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చేస్తా అని రాసిన ఫ్లకార్డు వైరల్ అవుతుంది. IPL 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లో జరగనుంది. నాల్గవ సారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్‌లో ట్రోఫీ కోసం పోటీ పడుతున్నది.

ఈ ఫ్లకార్డు మే 29న జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు సంబంధించినది. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లో స్థానం సంపాదించింది. RCB విజయం సాధించిన వెంటనే ఒక మహిళా అభిమాని ఫోటో వైరల్ అయింది. ఈ అభిమాని చేతిలో ఒక పోస్టర్ పట్టుకుని ఉంది. అందులో ఇలా రాసి ఉంది. ‘‘RCB ఫైనల్ గెలవకపోతే నేను నా భర్తకు విడాకులు ఇస్తాను’’ అని రాసి ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో భారీగా షేర్ చేయబడుతోంది.

Also Read: PAN Card: పాన్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. రూ. 10 వేల జరిమానా?

ఫైనల్‌లో RCB ఎవరితో ఆడుతుంది?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు IPL 2025 ఫైనల్‌కు వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. ఇది పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. పంజాబ్ పాయింట్ల టేబుల్‌లో టాప్-2లో ఉండటం వల్ల.. క్వాలిఫయర్-1లో ఓడినప్పటికీ ఫైనల్‌కు వెళ్లే రెండో అవకాశం లభించింది. ఇప్పుడు క్వాలిఫయర్-2లో పంజాబ్, ముంబై ఇండియన్స్‌తో జూన్ 1న తలపడనుంది. పంజాబ్-ముంబై మ్యాచ్ విజేత జూన్ 3న ఫైనల్‌లో RCBతో ఆడనుంది. బెంగళూరు ఇంతకు ముందు 3 ఫైనల్స్ ఆడింది. కానీ మూడు సార్లూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. RCB 2009, 2011, 2016లో IPL ఫైనల్స్‌లో ఓడిపోయింది. ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత బెంగళూరు జట్టు మళ్లీ టైటిల్‌కు చాలా దగ్గరగా వచ్చింది.