Site icon HashtagU Telugu

ICC Women’s Under-19 T20 World Cup 2025 : టీం సభ్యులు వీరే ..

Icc Women's Under 19 T20 Wo

Icc Women's Under 19 T20 Wo

అమెరికా క్రికెట్ సంఘం జనవరి 18 నుండి ఫిబ్రవరి 2, 2024 వరకు మలేసియాలో జరుగనున్న ICC U19 మహిళల T20 ప్రపంచకప్ (ICC Women’s Under-19 T20 World Cup) కోసం తమ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తెలుగు-అమెరికన్ క్రికెటర్ అనికా రెడ్డి కోలన్‌(Kolan Anika Reddy)ను జట్టు కెప్టెన్‌గా నియమించడం గర్వకారణంగా నిలిచింది. ఈ జట్టులో మొత్తం నలుగురు తెలుగు క్రికెటర్లు – అనికా రెడ్డి కోలన్, పగిడాల చెతన రెడ్డి, ఇమ్మడి సంవి, శాషా వల్లభనేని చోటు దక్కించుకోవడం విశేషం.

పశ్చిమ ఇండీస్ పర్యటనలో విజయవంతంగా జట్టును నాయకత్వం వహించిన అనికా రెడ్డి, మరోసారి కెప్టెన్‌గా జట్టును నడిపించబోతుంది. ఆమెకు తోడుగా అదితిబా చుదాసమా (Aditiba Chudasama) వ్యవహరించనున్నారు. అనికా, అదితిబా సహా మరికొందరు ఆటగాళ్లు 2023లో జరిగిన తొలి మహిళల U19 ప్రపంచకప్‌లో పాల్గొనడం తమ అనుభవాన్ని జట్టుకు అందించనుంది. అనికా, చెతన, సంవి, శాషా – అమెరికా క్రికెట్‌లో తెలుగు వారిలో పెరుగుతున్న ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి. వీరి జట్టులో ఎంపిక భారతీయ మూలాల క్రికెటర్లకు అమెరికా క్రికెట్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

టోర్నమెంట్ వివరాలు చూస్తే..

ఈ టోర్నమెంట్‌లో 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడ్డాయి. అమెరికా జట్టు ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లతో కలిసి గ్రూప్ బిలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు గ్రూప్ ఏలో ఉండగా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్ జట్లు గ్రూప్ డిలో ఉన్నాయి.

జట్టు సభ్యులు :

•కెప్టెన్: కొలన్ అనికా రెడ్డి
•వైస్-కెప్టెన్: అదితిబా చూడాసమా
•పగిడాల చేతన రెడ్డి
•చేత్నా జి ప్రసాద్
•దిషా ధింగ్రా
•ఇసాని మహేష్ వాఘేలా
•లేఖా హనుమంత్ శెట్టి
•మాహి మాధవన్
•నిఖర్ పింకు దోషి
• పూజ గణేష్
•పూజా షా
• రీతూ ప్రియా సింగ్
•ఇమ్మడి సాన్వి
•సాషా వల్లభనేని
•సుహాని తడాని

Read Also :  Delhi Assembly Elections : ఈ ఎన్నికలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు: అరవింద్‌ కేజ్రీవాల్‌

Exit mobile version