Site icon HashtagU Telugu

ICC Womens U-19 T20 World Cup: సంచ‌ల‌నం.. 17 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా!

ICC Womens U-19 T20 World Cup

ICC Womens U-19 T20 World Cup

ICC Womens U-19 T20 World Cup: అండర్-19 టీ-20 ప్రపంచకప్‌లో (ICC Womens U-19 T20 World Cup) భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో మలేషియాపై విజయం సాధించింది. బౌలింగ్‌లో వైష్ణవి శర్మ కేవలం 5 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి విధ్వంసం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా వైష్ణవి రికార్డు సృష్టించింది. వైష్ణవి బౌలింగ్‌కు మలేషియా బ్యాట్స్‌మెన్ సులువుగా ఔట్ కావడంతో జట్టు మొత్తం 31 పరుగులకే కుప్పకూలింది. 32 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17 బంతుల్లో వికెట్ నష్టపోకుండా టీమిండియా ఛేదించింది.

17 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించారు

వైష్ణవి శర్మ ధాటికి టీమిండియా 31 పరుగులకే మలేషియాను ఆలౌట్ చేసింది. అనంతరం 32 పరుగుల లక్ష్యాన్ని ఓపెనింగ్ జోడీ గొంగడి త్రిష, జి కమలిని 17 బంతుల్లోనే ఛేదించారు. త్రిష మరింత దూకుడును ప్రదర్శించింది. కేవలం 12 బంతుల్లో 27 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో త్రిష 5 ఫోర్లు కొట్టింది. కాగా కమలిని 4 పరుగులు చేసి మరో ఎండ్‌లో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించి వెనుదిరిగింది. టీ-20 క్రికెట్‌లో భారత జట్టు చేసిన రెండో ఫాస్టెస్ట్ ఛేజింగ్ ఇది. టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read: England: భార‌త్‌తో తొలి టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్ర‌క‌టించిన ఇంగ్లండ్‌!

వైష్ణవి విధ్వంసం సృష్టించింది

19 ఏళ్ల స్పిన్ బౌలర్ వైష్ణవి శర్మ నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 5 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి విధ్వంసం సృష్టించింది. మలేషియా బ్యాట్స్‌మెన్‌లు వైష్ణవి ముందు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు. వైష్ణవి బౌలింగ్‌లో ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు చేరుకోవడం ప్రారంభించారు. వైష్ణవి తన స్పెల్ చివరి ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ పూర్తి చేసింది. అండర్-19 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా వైష్ణవి రికార్డు సృష్టించింది. టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న వైష్ణవి అద్భుతమైన బౌలింగ్‌ కారణంగా భారత జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ విజయాన్ని చవిచూసింది.