Site icon HashtagU Telugu

Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ విడుదల.. భారత్‌- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Women's T20 World Cup

Safeimagekit Resized Img (3) 11zon

Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 (Women’s T20 World Cup) షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. భారత మహిళల జట్టు గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకుంది. ఇందులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా ఉన్నాయి. అక్టోబర్ 3 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. భారత్‌ తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 4న జరగనుంది.

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. దీని తర్వాత క్వాలిఫయర్ 1 జట్టుతో టీమ్ ఇండియా తలపడనుంది. అక్టోబర్ 13న భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక తొలి సెమీఫైనల్ గురించి మాట్లాడుకుంటే అక్టోబర్ 17న మొద‌టి సెమీఫైన‌ల్‌, అక్టోబ‌ర్ 18న‌ రెండో సెమీఫైనల్ జరగనుంది. అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Also Read: KKR vs LSG: ఏ జ‌ట్టు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయ‌మేనా..? నేడు ల‌క్నో వ‌ర్సెస్ కేకేఆర్ మ‌ధ్య మ్యాచ్‌..!

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో మొత్తం 23 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లు 19 రోజుల్లో ఢాకా, సిల్హెట్‌లలో జరగనున్నాయి. టోర్నీ కోసం రెండు గ్రూపులను ఏర్పాటు చేశారు. గ్రూప్ ఎలో ఐదు జట్లు ఉన్నాయి. గ్రూప్ బిలో ఐదు జట్లు ఉన్నాయి. ఏ గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్వాలిఫయర్ 1 జట్లు ఉంటాయి. గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, క్వాలిఫయర్‌ 2 జట్లు చోటు దక్కించుకున్నాయి. టోర్నీలో ఒక్కో జట్టు మొత్తం నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. దీని తర్వాత ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఇది అక్టోబర్ 17, 18 తేదీలలో జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయింది. ఇందులో ఆస్ట్రేలియా అత్యధిక టైటిళ్లు గెలుచుకుంది. ఆస్ట్రేలియా 6 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లు ఒక్కోసారి టైటిల్‌ను గెలుచుకున్నాయి. T20 ప్రపంచ కప్ 2016 భారతదేశంలో మాత్రమే నిర్వహించబడింది. దీని ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. టీం ఇండియా ఒక్కసారి ఫైనల్స్‌కు చేరుకుంది. 2020లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.

We’re now on WhatsApp : Click to Join