Site icon HashtagU Telugu

ICC New Rule: స్టంపౌట్ విషయంలో ఐసీసీ సంచలన నిర్ణయం

ICC New Rule

ICC New Rule

ICC New Rule: స్టంపౌట్ విషయంలో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టంప్ ఔట్ అప్పీల్ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ బ్యాటర్లకు సానుకూలంగా మారనుంది. స్టంపింగ్ విషయంలో వికెట్ కీపర్ అప్పీల్ చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేస్తాడు. థర్డ్ అంపైర్ రిప్లేలో ఆల్ ట్రా ఎడ్జ్ చేసి స్టంప్ ఔటా కాదా అని డిసైడ్ చేసి రిజల్ట్ ప్రకటిస్తాడు. కానీ తాజాగా ఐసీసీ కొత్త నిబంధలని ప్రవేశపెట్టడంతో ఇక నుంచి థర్డ్ అంపైర్ కేవలం స్టంపింగ్ ను మాత్రమే చెక్ చేయాలి. బ్యాట్ కు బంతి తాకిందా? లేదా? అన్న విషయాన్ని చూడకూడదు. ఇంతకుముందు బంతి బ్యాట్ ను తాకితే క్యాచ్ ఔట్ ఇచ్చేవారు. తాకకుంటే స్టంప్ ఔట్ అప్పీల్ ను పరిశీలిస్తారు. ఒక్క అప్పీల్ తో క్యాచ్, స్టంప్ ఔట్ లు రెండింటినీ పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఈ నిబంధనను ఉపయోగించుకుని ఫీల్డింగ్ జట్లు ప్రయోజనం పొందుతున్నాయి. ఆటగాళ్లు ఎక్కువ శాతం ఈ రూల్ ను ఉపయోగించుకుంటున్నారని ఐసీసీ ఈ మార్పు తీసుకొచ్చింది. డీఆర్ఎస్ మిస్ యూజ్ చేసే అవకాశం లేకుండా ఈ మార్పులు చేసినట్లు ఐసీసీ తెలిపింది.

Also Read: Balakrishna : ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ షూటింగ్ టైంలో.. బాలయ్య కండిషన్.. రోజు ఇంటి దగ్గర నుంచి..