ICC: వన్డే క్రికెట్‌లో ఐసీసీ (ICC) ఒక కొత్త నియమాన్ని తీసుకొస్తోంది, ఇది బౌలర్లకు ప్రయోజనం చేకూర్చేలా కనిపిస్తోంది. బీసీసీఐ ఈ నియమాన్ని ఐపీఎల్ 2025లో ఇప్పటికే అమలు చేసింది. ఐపీఎల్‌లో ఈ నియమం బౌలర్లకు డెత్ ఓవర్లలో బంతిని తాజాగా, పొడిగా ఉంచడంలో సహాయపడింది. తద్వారా రివర్స్ స్వింగ్ సాధ్యమైంది.
డెత్ ఓవర్లలో బౌలర్లకు సహాయం
జులైలో అమలులోకి రానున్న ఐసీసీ ఈ కొత్త నియమం తర్వాత వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్ల పాటు రెండు బంతుల వినియోగం ఉండదు. క్రిక్‌బజ్ ప్రకారం.. ఐసీసీ తన సభ్యులకు తెలియజేస్తూ.. 1 నుండి 34 ఓవర్ల వరకు రెండు కొత్త బంతులు ఉంటాయి. 34 ఓవర్లు పూర్తయిన తర్వాత 35వ ఓవర్ ప్రారంభానికి ముందు ఫీల్డింగ్ జట్టు 35 నుండి 50 ఓవర్ల వరకు ఉపయోగించే రెండు బంతులలో ఒక బంతిని ఎంచుకుంటుంది. ఎంచుకున్న బంతిని మ్యాచ్ మిగిలిన సమయంలో రెండు వైపులా ఉపయోగిస్తారు. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు 25 ఓవర్లు లేదా అంతకంటే తక్కువ ఓవర్ల మ్యాచ్‌లో ప్రతి జట్టుకు తమ ఇన్నింగ్స్ కోసం ఒక కొత్త బంతి మాత్రమే ఉంటుంది అని పేర్కొంది.
Also Read: Gulzar House : మరణాలకు ఫైర్ సిబ్బంది , ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యమే కారణం – బాధితుల ఆరోపణలు
ఈ నియమం అమలులోకి రావడానికి మొదటి సంకేతాలు ఏప్రిల్‌లో కనిపించాయి. ఇప్పుడు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా దీనిని ఆమోదించారు. ఈ నియమం జులై 2 నుండి కొలంబోలో ప్రారంభమయ్యే శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే సిరీస్ సందర్భంగా అమలు చేయబడుతుంది.
WTC 2025 ఫైనల్‌కు ముందు కొత్త నియమాలు
వచ్చే నెల జూన్‌లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు ఐసీసీ కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఇవి వన్డే, టెస్ట్ రెండు ఫార్మాట్‌లలోనూ అమలు కానున్నాయి. టెస్ట్ ఫార్మాట్‌లో ఈ కొత్త నియమాలు జూన్ 17న శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య గాల్‌లో జరిగే మ్యాచ్ నుండి అమలులోకి వస్తాయి.