ICC T20I Rankings : ఆరేళ్ళ తర్వాత భారత్ కు టాప్ ప్లేస్

వెస్టిండీస్ పై టీ ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అటు ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దుమ్మురేపింది.

Published By: HashtagU Telugu Desk
T20 Iccrankings

T20 Iccrankings

వెస్టిండీస్ పై టీ ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అటు ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దుమ్మురేపింది. దాదాపు ఆరేళ్ళ తర్వాత అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను 3-0 తో గెలుచుకున్న భారత్ ర్యాంకింగ్స్ లో తమ రేటింగ్ పాయింట్లను బాగా మెరుగుపరుచుకుంది. విండీస్ పై స్వీప్ తర్వాత భారత్ 269 రేటింగ్ పాయింట్లు సాధించి టాప్ ప్లేస్ కు దూసుకొచ్చింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలోని టీమిండియా 2016లో చివరిసారిగా అగ్ర స్థానం సాధించింది. ఆ ఏడాది మే నెలలో నెంబర్ వన్ ప్లేస్ ను కోల్పోయిన టీమిండియా.. మళ్లీ ఆరేళ్ళ తరువాత రోహిత్ శర్మ సారథ్యంలో టాప్ ప్లేస్ చేజిక్కించుకుంది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకి ఇదే తొలి టీ20 సిరీస్‌. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కూడా టీమిండియా 3-0 తేడాతో వైట్ వాష్ చేసిన చేసిన రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు సాధించాడు.. టీ20 ఫార్మాట్‌లో మూడు లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన భారత సారథిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు 2017లో విరాట్ కోహ్లీ స్థానంలో సారథిగా వ్యవహరించిన రోహిత్‌ శర్మ శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసింది. అలాగే 2018లో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. తాజాగా మరోసారి కరేబియన్ టీమ్ పైనే స్వీప్ చేయడం ద్వారా రోహిత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును కూడా రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌ ద్వారా బ్రేక్ చేసాడు.. స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన సారథిగా రోహిత్‌ శర్మ ఘనత సాధించాడు. స్వదేశంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 15 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

  Last Updated: 21 Feb 2022, 12:59 PM IST