T20 World Cup History: 2007 నుంచి 2022 వరకు టీ20 ప్రపంచకప్ చరిత్ర

2007వ సంవత్సరంలో ప్రారంభమైన టి20 ప్రపంచకప్ సక్సెసఫుల్ టోర్నీగా జర్నీ కొనసాగిస్తుంది. ఆరంభ టోర్నీలో ధోనీ సారధ్యంలో టీమిండియా తొలిసారి టి20 ప్రపంచకప్ లిఫ్ట్ చేసింది. ఫైనల్లో భారత్ , పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పోరులో టీమిండియా పాకిస్థాన్ ని ఐదు పరుగుల తేడాతో ఓడించి తొలి టి20 ప్రపంచకప్ ను అందుకుంది.

T20 World Cup History: 2007వ సంవత్సరంలో ప్రారంభమైన టి20 ప్రపంచకప్ సక్సెసఫుల్ టోర్నీగా జర్నీ కొనసాగిస్తుంది. ఆరంభ టోర్నీలో ధోనీ సారధ్యంలో టీమిండియా తొలిసారి టి20 ప్రపంచకప్ లిఫ్ట్ చేసింది. ఫైనల్లో భారత్ , పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పోరులో టీమిండియా పాకిస్థాన్ ని ఐదు పరుగుల తేడాతో ఓడించి తొలి టి20 ప్రపంచకప్ ను అందుకుంది.

2009 లో పాకిస్తాన్ కప్ గెలిచింది. ఫైనల్లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తలపడగా 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించి రెండో టి20 ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేయగా ఇంగ్లీష్ బ్యాటర్లు కేవలం 17 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించారు. ఇక 2012 లో జరిగిన టి20 ప్రపంచకప్ టైటిల్ మ్యాచ్ లో వెస్టిండీస్ శ్రీలంకను చిత్తుగా ఓడించి టైటిల్ గెలిచింది. అయితే 2014లో భారత్ రెండోసారి ఫైనల్ కు చేరింది. కాకపోతే శ్రీలంక అద్భుత ప్రదర్శనతో భారత్ ను ఓడించి టి20 ప్రపంచకప్ ఎగురేసుకుపోయింది.

2016లో వెస్టిండీస్ మరోసారి టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 155 పరుగులు చేయగా, ఛేదనలో విండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.అయితే 2016 తర్వాత కొవిడ్ మహమ్మారి కారణంగా నాలుగేళ్లపాటు టి20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహించలేదు. 2016 తర్వాత 2021 లోనే మళ్ళీ ఈ టోర్నీని ఆడించారు. కాగా 2021 టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడగా.. 8 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించి తొలి టి20 ప్రపంచకప్ గెలుచుకుంది. ఇకపోతే చివరి పొట్టి ప్రపంచకప్ 2022లో జరిగింది. ఫైనల్ పోరులో పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 19 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించి రెండోసారి టి20 ప్రపంచకప్ ఛాంపియన్ గా నిలిచింది. ఇదిలా ఉండగా 2024 టి20 ప్రపంచకప్ జూన్ 2న ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్ లో ఛాంపియన్ గా నిలిచే జట్టదో కామెంట్ లో తెలపండి.

Also Read: Ram Charan : హైదరాబాద్ శివారులో RC16 కోసం భారీ సెట్స్ నిర్మాణం..