Site icon HashtagU Telugu

T20 World Cup: స్టోక్స్ వచ్చేశాడు…వరల్డ్‌కప్‌ టీమ్‌లో చోటు

Jason Roy Imresizer

Jason Roy Imresizer

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఒక్కొక్క దేశం తమ తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును వెల్లడించగా… తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా తమ టీమ్‌ను ప్రకటించింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మేట్‌కు రీఎంట్రీ ఇచ్చాడు. గత కొంత కాలంగా స్టోక్స్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే నిలకడగా రాణించలేకపోతున్న ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌పై వేటు పడింది.
పేస్‌ ద్వయం క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ కూడా ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారుజోస్‌ బట్లర్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ అక్టోబరు 22న అఫ్గనిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ వరకూ చేరింది. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లీష్ టీమ్ చివరి సారిగా 2010లో వరల్డ్‌కప్‌ గెలిచింది.

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ జట్టు ః
జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలాన్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టోప్లే, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌.

Exit mobile version