ICC T20 WC Squad: వరల్డ్ కప్ కు జడేజా స్థానంలో ఎవరు ?

ప్రస్తుతం ఆసియాకప్ లో బిజీగా ఉన్న టీమిండియాకు టోర్నీ మధ్యలో షాక్ తగిలింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 02:12 PM IST

ప్రస్తుతం ఆసియాకప్ లో బిజీగా ఉన్న టీమిండియాకు టోర్నీ మధ్యలో షాక్ తగిలింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతని స్థానంలో అక్షర్ పటేల్ కు అవకాశం దక్కింది. అయితే గాయం తీవ్రంగానే ఉండడంతో సర్జరీ జడేజా చేయించుకోనున్నాడు. మోకాలి గాయానికి సర్జరీ కారణంగా చాలా రోజుల పాటు మైదానానికి దూరం కానున్నాడు జడ్డూ. అధికారిక ప్రకటన లేకున్నా జడేజా దాదాపు 5 నుంచి 6 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశముంది. టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు భారత్ కు ఇది గట్టి ఎదురుదెబ్బే.

ఎందుకంటే షార్ట్ ఫార్మేట్ లో జడేజా లాంటి ఆల్ రౌండర్ ఖచ్చితంగా జట్టులో ఉండాలి. జడేజా ఇందులో దేశీయ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ, ఐపీఎల్ గేమలన్నీ కలిపి 897 వికెట్లను పడగొట్టాడు. అంతేకాకుండా అన్నీ పార్మాట్లలో కలిపి 13 వేల పరుగులు చేశాడు. బంతి, బ్యాట్ తోనే కాదు జడేజా ఫీల్డింగ్ లోనూ అదరగొడతాడు. ప్రస్తుతం గాయంతో అతను వరల్డ్ కప్ కు కూడా దూరం కానున్న నేపథ్యంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జడేజా స్థానం కోసం రేసులో ముందున్నాడు అక్షర్ పటేల్. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ నిలకడగా రాణించే అక్షర్ పటేల్ బంతితోనే కాదు బ్యాట్ తోనూ సత్తా చాటుతున్నాడు. లోయర్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ లాంటి హిట్టర్ ఉంటే బ్యాటింగ్ మరింత బలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

దీంతో వచ్చే వరల్డ్ కప్ కు జడేజా స్థానంలో అక్షర్ కే చోటు దక్కుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆసియాకప్ లో జట్టుతో కలిసి అక్షర్ ఈ టోర్నీలో సత్తా చాటితే వరల్డ్ కప్ టీమ్ లో బెర్త్ దక్కించుకోవచ్చు. ఐపీఎల్ లో 101 వికెట్లు , 25 అంతర్జాతీయ టీ ట్వంటీల్లో 21 వికెట్లు పడగొట్టిన అక్షర్ బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో 1135 రన్స్ చేశాడు.