ICC Suspends Sri Lanka: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ..!

ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు (ICC Suspends Sri Lanka) చాలా పేలవ ప్రదర్శన చేసింది. శ్రీలంక క్రికెట్ జట్టు లీగ్ దశలో 9 మ్యాచ్‌లు ఆడగా 2 మాత్రమే గెలిచి 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Sri Lanka

Srilanka

ICC Suspends Sri Lanka: ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు (ICC Suspends Sri Lanka) చాలా పేలవ ప్రదర్శన చేసింది. శ్రీలంక క్రికెట్ జట్టు లీగ్ దశలో 9 మ్యాచ్‌లు ఆడగా 2 మాత్రమే గెలిచి 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని ICC నిషేధించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శ్రీలంకపై నిషేధం విధించింది. శుక్రవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక క్రికెట్ నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో లంక సభ్యత్వాన్ని ఐసిసి శుక్రవారం సస్పెండ్ చేసింది. నిషేధం ఎత్తివేసే వరకు శ్రీలంక జట్టు ఐసీసీ ఈవెంట్లలో ఆడలేదు.

శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సి)లో ప్రభుత్వ జోక్యం పెరుగుతున్న నేపథ్యంలో ఐసిసి నిషేధం విధించింది. ప్రపంచ కప్ 2023లో శ్రీలంక పేలవమైన ప్రదర్శన తర్వాత క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ SLC బోర్డును రద్దు చేసి కొత్త మధ్యంతర కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.

ఐసీసీ త్రైమాసిక సమావేశం నవంబర్ 18-21 మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. దీనికి ముందు ఐసిసి బోర్డు శుక్రవారం ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించి శ్రీలంక క్రికెట్‌లో గందరగోళంపై మాట్లాడింది. శ్రీలంక బోర్డుకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని, క్రికెట్ జట్టుకు సంబంధించిన విషయాలలో కూడా ఐసిసి ఆందోళన చెందుతుందని నమ్మారు. ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం గురించి శ్రీలంక బోర్డుకు తెలియజేశారు. తదుపరి దశను నవంబర్ 21న ICC బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని కూడా చెప్పినట్లు తెలుస్తుంది.

Also Read: India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్.. కివీస్ పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?

2019లో జింబాబ్వేపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ఆఫ్రికన్ దేశం తర్వాత గత నాలుగేళ్లలో నిషేధించబడిన రెండవ పూర్తి సభ్యదేశంగా శ్రీలంక ఉంది. శ్రీలంక మాదిరిగానే జింబాబ్వే క్రికెట్‌లో కూడా ప్రభుత్వ జోక్యం పెరిగింది. దీంతో నిషేధం విధించారు. జింబాబ్వేలో క్రికెట్‌ను అకస్మాత్తుగా నిలిపివేయాలని ఐసీసీ నిర్ణయించింది. నిధులు కూడా నిలిచిపోయాయి. అయితే అందుకు విరుద్ధంగా శ్రీలంక విషయంలో ఐసీసీ మరింత మెతక వైఖరిని అవలంబిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుత ODI ప్రపంచ కప్ లో శ్రీలంక పోరు ముగిసింది. అయితే వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించబోతున్న ICC T20 ప్రపంచ కప్ 2024 ఉంది. ఇటువంటి పరిస్థితిలో ICC.. శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని తదుపరి ప్రపంచ కప్ వరకు పునరుద్ధరించకపోతే వారి జట్టు వచ్చే ఏడాది జరిగే T20 ప్రపంచ కప్‌లో కూడా ఆడలేరు.

  Last Updated: 11 Nov 2023, 06:42 AM IST