World Cup 2023: గంభీర్​కు షాక్ ఇచ్చిన ఐసీసీ

వామప్ మ్యాచ్ లు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రపంచ కప్ జోరు మరింత పెరిగింది. టోర్నీలో అసలు సిసలైన పోరు మాత్రం అక్టోబర్ 5న జరుగుతుంది. మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్,

Published By: HashtagU Telugu Desk
World Cup 2023 (3)

World Cup 2023 (3)

World Cup 2023: వామప్ మ్యాచ్ లు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రపంచ కప్ జోరు మరింత పెరిగింది. టోర్నీలో అసలు సిసలైన పోరు మాత్రం అక్టోబర్ 5న జరుగుతుంది. మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. టోర్నీలో ఆటగాళ్ల విధ్వంసానికి తగ్గట్లు కామెంట్రీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్లేయర్లు కొదమసింహాల్లా పోరాడుతుంటే దాన్ని కామెంట్రీతో నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్లే బాధ్యత కామెంటేటర్లదే.

కామెంటేటర్ల ప్యానెల్​లో 31 మంది సభ్యులుంటారు. ఈ జాబితాలో ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ దేశాలకు చెందిన పలువురు వరల్డ్ కప్ విన్నర్లు ఉన్నారు. ఇందులో భారత్​ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. హర్షా భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, దినేష్ కార్తీక్, అంజుమ్ చోప్రాలు ప్రపంచ కప్ లో వాయిస్ వినిపించనున్నారు. మ్యాచ్ కామెంట్రీ, ప్రీ మ్యాచ్ షో, మిడ్ ఇన్నింగ్స్, పోస్ట్ మ్యాచ్ లకు వీళ్ల వాయిస్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ విషయంలో గౌతం గంభీర్​కు ఐసీసీ షాక్ ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్​ కామెంటేటర్స్ ప్యానెల్​లో అతడికి అవకాశం దక్కలేదు. ఆసియా కప్​లో కామెంటేటర్​గా వ్యవహరించిన గంభీర్​కు వరల్డ్ కప్ ప్యానెల్​లో ఛాన్స్ ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంతగడ్డపై ప్రపంచ కప్ జరుగుతున్నప్పుడు లెజెండరీ అతగాడిని పక్కనపెట్టడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కామెంటేటర్​గా పాక్ తరఫున రమీజ్ రాజాను సెలెక్ట్ చేశారు, రమీజ్ రాజా గతంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. అతనికి ఛాన్స్ ఇచ్చినప్పుడు గంభీర్​ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ ఐసీసీ ని నిలదీస్తున్నారు.

Also Read: RC16 : బేబమ్మని వదలని బుచ్చి బాబు..!

  Last Updated: 30 Sep 2023, 06:39 PM IST