World Cup Promo: ఐసీసీ భావోద్వేగ వీడియో .. ధోనీ రన్ అవుట్ క్షణాలు

వన్డే ప్రపంచ కప్ కు సమయం దగ్గరపడుతోంది. కపిల్ సారధ్యంలో మొదటిసారి ప్రపంచ కప్ ను ముద్దాడిన టీమిండియా చాన్నాళ్ల తరువాత 2011లో ధోనీ హయాంలో

Published By: HashtagU Telugu Desk
World Cup Promo

New Web Story Copy 2023 07 20t161134.559

World Cup Promo: వన్డే ప్రపంచ కప్ కు సమయం దగ్గరపడుతోంది. కపిల్ దేవ్ సారధ్యంలో మొదటిసారి ప్రపంచ కప్ ను ముద్దాడిన టీమిండియా చాన్నాళ్ల తరువాత 2011లో ధోనీ హయాంలో మళ్ళీ వరల్డ్ కప్ కోరిక తీరింది. 2019 లో సెమీ ఫైనల్ లో న్యుజిలాండ్ పై ఓటమి చెంది ఆ సంవత్సరం వరల్డ్ కప్ కు దూరమైంది టీమిండియా. ఇక ఇప్పుడు అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్స్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 15న ఈ మైదానంలో భారత్-పాకిస్థాన్ మధ్య గ్రేట్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉండగా తాజాగా ఐసీసీ వరల్డ్ కప్ ప్రోమో వీడియోను విడుదల చేసింది.

ICC తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. 2 నిమిషాల 13 సెకన్ల వీడియోలో ICC చారిత్రాత్మక ప్రపంచ కప్ గత చరిత్రను వెలికితీసింది. ఈ వీడియోలో ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు ఎన్నో మధురక్షణాలను పంచుకుంది. ధోనీ రన్ అవుట్ అయిన క్షణాన్ని వీడియోలో చూపించారు. ఇక 2011 ప్రపంచ కప్ లో ధోనీ సిక్సర్ ని చూపించి మరింత ఆసక్తిని పెంచారు. యువరాజ్ సింగ్ గర్జనతో ఉన్న క్లిప్పింగ్ కూడా వీడియోలో చూడొచ్చు.

వెస్టిండీస్ చారిత్రాత్మక క్షణాలు మొదటి ODI ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు భావోద్వేగం మరియు లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ ట్రోఫీని ముద్దాడడం ఇలా ఎన్నో మర్చిపోలేని అనుభూతులతో ఐసీసీ వీడియోని తయారు చేసి పోస్ట్ చేసింది. చివర్లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ డైలాగ్స్ తో వీడియో ముగుస్తుంది. క్రికెట్ ప్రియులని ఈ వీడియో ఎంతో ఆకట్టుకుంటుందో.

Also Read: MLC Kavitha: తెలంగాణలో 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు.. 30 లక్షల ఉద్యోగాలు

  Last Updated: 20 Jul 2023, 04:17 PM IST