Site icon HashtagU Telugu

World Cup 2023: అదిరిపోయిన వరల్డ్‌ కప్‌ యాంథమ్‌

World Cup 2023

World Cup 2023

World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు వారాల్లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారత్ లోని 10 వేదికల్లో వన్డే మహాసంగ్రామం జరగనుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్ తో ప్రపంచకప్ ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయి. ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఇక ఈ మహాసంగ్రామం కోసం ప్రపంచ క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీ కోసం దాదాపు అన్ని దేశాలు తమ తమ జట్లను ప్రకటించాయి. 2011లో వరల్డ్‌ కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఆ టోర్నీ ఆరంభానికి ముందు ఓ థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. శంకర్‌ మహదేవన్‌ పాడిన వరల్డ్‌ కప్‌ యాంథమ్‌ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికి తెలిసిందే.

ఈ సారి వరల్డ్‌ కప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇస్తుంది. కాబట్టి బీసీసీఐ వరల్డ్‌ కప్‌ థీమ్‌ సాంగ్‌ను రూపొందించింది. ఈ సాంగ్ ని ఐసీసీ విడుదల చేసింది. రణ్‌వీర్‌ సింగ్‌ డ్యాన్సింగ్‌తో వన్డే ఎక్స్‌ప్రెస్‌ థీమ్‌తో సాంగ్‌ అయితే అదిరిపోయింది. ఈ సాంగ్‌లో టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ భార్య హైలెట్ గ నిలిచారు. ప్రీతమ్‌ సంగీతం అందించిన ఈ థీమ్ కు శ్లోక్ లాల్, సావేరి వర్మ సాహిత్యం సమకూర్చారు. ప్రీతమ్, నకాష్ అజీజ్, శ్రీరామ చంద్ర, అమిత్ మిశ్రా, జోనితా గాంధీ, అక్సా, చరణ్ సంయుక్తంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది.

Also Read: Raja Joined in Congress : ఏపీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సినీ నటుడు రాజా..