Site icon HashtagU Telugu

ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. భారీగా లాభ‌ప‌డిన పంత్‌, జ‌డేజా

ICC Rankings

ICC Rankings

ICC Rankings: ఈ వారం ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) భారత క్రికెటర్లు రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ స్థానాల్లో మార్పులు వచ్చాయి. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్ మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకున్నాడు. నాలుగో టెస్టులో గాయపడినప్పటికీ మొదటి ఇన్నింగ్స్‌లో సాధించిన అర్ధ సెంచరీ అతనికి ఈ ర్యాంకింగ్ మెరుగుదలకు సహాయపడింది. ఈ సిరీస్‌లో పంత్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 68 సగటుతో 479 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.

యశస్వీ జైస్వాల్‌కు నష్టం

మరోవైపు నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసినప్పటికీ యశస్వీ జైస్వాల్ మూడు స్థానాలు కిందకి పడిపోయి 8వ స్థానానికి చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అవ్వడం దీనికి ఒక కారణం కావచ్చు.

శుభ్‌మన్ గిల్, జో రూట్

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాంచెస్టర్‌లో శతకం సాధించినప్పటికీ తన 9వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. నాలుగో టెస్ట్‌లో రూట్ 150 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read: CBN Singapore Tour : సక్సెస్ ఫుల్ గా సింగపూర్ పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరిన చంద్రబాబు

బెన్ స్టోక్స్‌ను అధిగమించి రవీంద్ర జడేజా

తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్ని విభాగాల్లోనూ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అధిగమించాడు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో వారి ప్రదర్శన ఆధారంగా ఈ కొత్త ర్యాంకింగ్‌లు వెలువడ్డాయి.

రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్

బెన్ స్టోక్స్ ర్యాంకింగ్స్