ICC Ranking: టాప్ ప్లేస్ లోనే భారత్.. ఇంగ్లాండ్ కు రెండో స్థానం

నెలరోజులుగా అభిమానులను అలరించిన టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసింది. పలు సంచలనాలు నమోదవుతూ సాగిన ఈ మెగా టోర్నీలో చివరికి ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.

  • Written By:
  • Updated On - November 14, 2022 / 11:33 AM IST

నెలరోజులుగా అభిమానులను అలరించిన టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసింది. పలు సంచలనాలు నమోదవుతూ సాగిన ఈ మెగా టోర్నీలో చివరికి ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాిధించింది. అయితే ప్రపంచకప్ గెలిచినా ఇంగ్లాండ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలోనే నిలిచింది. సెమీస్ లో ఇంటిదారి పట్టిన టీమిండియా తన టాప్ ప్లేస్ నిలబెట్టుకుంది. తాజాగా ప్రకటించిన జాబితాలో భారత్ 268 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ 265 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది.

భారత్ కూ, ఇంగ్లాండ్ కూ మధ్య 3 పాయింట్లే తేడా ఉంది. పాకిస్తాన్ మూడో స్థానంలోనూ, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి సెమీస్ చేరని ఆస్ట్రేలియా ఆరో స్థానంలో నిలిచింది. విండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ , ఆప్ఘనిస్థాన్ స్థానంలో ఉన్నాయి.