Site icon HashtagU Telugu

ICC Rankings : తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండు, మూడు స్థానాల్లో కోహ్లీ, రోహిత్

Kohli Rohit Sharma

Kohli Rohit Sharma

ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తర్వాత ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌ లో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. ఈ సిరీస్ లో బ్యాటింగ్ లో రాణించిన సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పును సాధించాడు. అదే సమయంలో ఇండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమతమ స్థానాలను నిలబెట్టుకున్నారు. మొత్తంగా ఇండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో క్వింటన్ డి కాక్ 229 పరుగులు చేశాడు. కేప్‌టౌన్‌లో 124 పరుగులు చేశాడీ సఫారీల కీపర్. దీంతో అతను నాలుగు స్థానాలు ఎగబాకి ఫోర్త్ ర్యాంక్ కు చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో వాన్ డెర్ డస్సెన్ 218 పరుగులు చేసి 10 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నాడు. అలానే దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ టెంబా బావుమా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ ను చేరుకున్నాడు. ప్రస్తుతం 59వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.మరోవైపు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా కాలం తర్వాత ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో ధావన్ మొత్తం 169 పరుగులు చేసి, 15వ స్థానానికి చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకిగ్స్ లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం మొదటి స్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ రెండు, రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలర్లలో సౌత్ ఆఫ్రికా జట్టు ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్గిడి చాలా కాలం తర్వాత టాప్ 20లోకి ప్రవేశించాడు. మరోవైపు స్పిన్‌ బౌలర్‌ కేశవ్‌ మహరాజ్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును సాధించి 33వ స్థానానికి చేరుకున్నాడు. ఇండియా బౌలిగ్ విషయానికొస్తే.. ఏడో స్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకోగలిగాడు.

Exit mobile version