ICC Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల.. బ్యాటింగ్ లో గిల్, బౌలింగ్ లో సిరాజ్ నంబర్ వన్..!

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ ​(ICC ODI Rankings)లో భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

  • Written By:
  • Updated On - November 9, 2023 / 05:15 PM IST

​ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ ​(ICC ODI Rankings)లో భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICC నవంబర్ 8 బుధవారం మధ్యాహ్నం ODI ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్ చేసింది. 950 రోజుల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నుంచి భారత ఓపెనర్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల మధ్య రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం పెద్దగా లేదు. బాబర్ అజామ్ 824 పాయింట్లు, శుభ్‌మన్ గిల్ 830 రేటింగ్ పాయింట్లతో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రపంచ కప్ 2023లో భారత ఓపెనర్‌కు ఇది పెద్ద ప్రోత్సాహం. ఈ ప్రపంచకప్‌లో అతని ఫామ్ అంతగా లేకపోయినా కొన్ని సందర్భాల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సమయంలో బాబర్ ఆజం తన జట్టు కోసం పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. దీంతో పాటు వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ భారీ విజయాలు సాధించాడు. ఇప్పుడు నాలుగో నంబర్‌కు చేరుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ చాలా కాలంగా నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగిన విషయం తెలిసిందే.

శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడుకుంటే.. అతను ప్రపంచ కప్ 2023లో 6 ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధ సెంచరీలతో మొత్తం 219 పరుగులు చేశాడు. అతని సగటు 36.50 కాగా, 30 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. బాబర్ అజామ్ ఈ ప్రపంచకప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 282 పరుగులు చేశాడు. బాబర్ బ్యాట్ నుంచి 26 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి. ఈ టోర్నీలో బాబర్ స్ట్రైక్ రేట్ 82.69 కాగా, శుభమన్ గిల్ స్ట్రైక్ రేట్ 96.90.

బౌలింగ్‌లో సిరాజ్ నంబర్ వన్

మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహరాజ్ రెండో స్థానంలో నిలిచాడు. సిరాజ్ ఖాతాలో 709 పాయింట్లు, మహరాజ్ ఖాతాలో 694 పాయింట్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్ల గురించి మాట్లాడుకుంటే.. షకీబ్ అల్ హసన్ చాలా కాలం పాటు అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గ్లెన్ మాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్‌పై డబుల్ సెంచరీ చేయడం ద్వారా నాలుగు స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read: Semi Final: సెమీఫైనల్‌ లో టీమిండియాతో తలపడే జట్టు ఏది.. ఏ జట్టుకు ఛాన్స్ ఉంది..?