Match Officials: టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా తొలి సూపర్ 8 మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. దీని తర్వాత బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో భారత జట్టు బరిలోకి దిగనుంది. జూన్ 24న సెయింట్ లూసియాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన ఓ సమాచారం వెలుగులోకి రావడంతో భారత అభిమానుల్లో టెన్షన్ పెరుగుతుంది. ఒక నివేదిక ప్రకారం.. ICC భారతదేశం-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరోను అంపైర్‌గా (Match Officials) ఎంపిక చేసింది.
వాస్తవానికి రిచర్డ్ కెటిల్‌బరో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో అంపైర్‌గా వ్యవహరించారు. 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. రిచర్డ్ ఇప్పుడు భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే సూపర్ 8 మ్యాచ్‌లో అంపైరింగ్ చేయనున్నాడు. అందుకే సోషల్ మీడియాలో అంపైర్‌పై జోరుగా చర్చ సాగుతోంది.
Also Read: USA vs SA: సూపర్-8 తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టిన సౌతాఫ్రికా.. 18 పరుగులతో అమెరికాపై విజయం!
2023 ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. వరుస విజయాలు నమోదు చేసిన రోహిత్ శర్మ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కెటిల్‌బోరో అంపైర్‌గా వ్యవహరించారు. అదే సమయంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆస్ట్రేలియాను 209 పరుగుల తేడాతో ఓడించింది. టీ20 ప్రపంచకప్ 2024లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా టీమిండియా సూపర్ 8కి చేరుకుంది. ఇక్కడ టీమిండిచా మూడో మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది.
We’re now on WhatsApp : Click to Join
గ్రూప్ మ్యాచ్‌లలో టీమ్ ఇండియా.. పాకిస్తాన్, యుఎస్ఎ, ఐర్లాండ్‌లను ఓడించిన మనకు తెలిసిందే. కెనడాతో మ్యాచ్ వర్షం కారణంగా అది రద్దయింది. ఇప్పుడు భారత జట్టు సూపర్ 8 మ్యాచ్‌లు ఆడనుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో గురువారం బార్బడోస్‌లో మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ జూన్ 22న ఆంటిగ్వాలో జరగనుంది. సెయింట్ లూసియాలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈనెల 24న జరగనుంది.