Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌పై ఐసీసీ చర్యలకు సిద్ధం

భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య కేప్‌టౌన్‌ వేదికగా జ‌రిగిన‌ రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగియ‌డం విస్మ‌యానికి గురి చేసింది. ఐదు సెష‌న్ల‌లోనే మ్యాచ్ ఫ‌లితం తేలిపోయిన న్యూలాండ్స్ పిచ్‌పై ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ స‌హా ప‌లువురు క్రికెట‌ర్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

Rohit Sharma: భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య కేప్‌టౌన్‌ వేదికగా జ‌రిగిన‌ రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగియ‌డం విస్మ‌యానికి గురి చేసింది. ఐదు సెష‌న్ల‌లోనే మ్యాచ్ ఫ‌లితం తేలిపోయిన న్యూలాండ్స్ పిచ్‌పై ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ స‌హా ప‌లువురు క్రికెట‌ర్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీల పై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. ఐసీసీ మరియు మ్యాచ్ రిఫ‌రీలు త‌ట‌స్థంగా ఉండాల‌న్నాడు. పిచ్‌ల‌కు రేటింగ్ ఇచ్చే విష‌యంలో ఐసీసీ ద్వంద్వ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టాడు.

ఆతిధ్య దేశాన్ని కాకుండా పిచ్ పరిస్థితిని చూసి రేటింగ్ ఇవ్వాలని రోహిత్ అభిప్రాయపడ్డాడు. భార‌త్‌లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌కప్ ఫైన‌ల్ మ్యాచ్‌ పిచ్ పై ఓ బ్యాట‌ర్ సెంచ‌రీ చేసినా ఐసీసీ దానికి యావ‌రేజ్ రేటింగ్ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశాడు భారత్‌కు వచ్చి ఆడేటప్పుడు ఇతరులు నోరు మూసుకుని ఉన్నంత వరకు ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు. రోహిత్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఐసీసీ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు రోహిత్ పై చ‌ర్య‌లు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధ‌మ‌వుతుంద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదే జ‌రిగితే రోహిత్ శ‌ర్మ‌పై నిషేదం లేదా జ‌రిమానా విధించే అవ‌కాశాలు ఉన్నాయి.

సెంచూరియ‌న్ టెస్టు మ్యాచ్ త్వరగా ముగియడంతో వివాదం చెలరేగింది. రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న స‌ఫారీ జ‌ట్టు 55 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. అనంత‌రం ర‌బ‌డ‌, బ‌ర్గ‌ర్ ధాటికి భార‌త బ్యాట‌ర్లు కూడా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. తొలి రోజే ఈ పిచ్‌పై ఏకంగా 23 వికెట్లు ప‌డ‌డం క్రికెట్ దిగ్గ‌జాలను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. కాగా రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి పలు రికార్డుల్ని బద్దలు కొట్టింది. ప్రస్తుతం భార‌త జ‌ట్టు అఫ్గానిస్తాన్‌తో సిరీస్ కోసం సిద్ద‌మ‌వుతోంది. జ‌న‌వ‌రి 11న మొహాలీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో సిరీస్ ఆరంభం కానుంది. ఇప్ప‌టికే రెండు దేశాలు త‌మ త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.

Also Read: PM Kisan : పీఎం కిసాన్ సాయం.. మరో రూ.2వేలు పెంపు ?