Site icon HashtagU Telugu

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌, భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..!

ICC Champions Trophy

ICC Champions Trophy

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) టోర్నమెంట్ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతాయి

ఐసీసీ అధికారిక షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో భారత్‌, పాకిస్థాన్‌లు తమ అన్ని మ్యాచ్‌లను 2027 వరకు తటస్థ వేదికలపైనే ఆడాలని నిర్ణయించారు. ఈ పరిస్థితిలో ఛాంపియన్స్ ట్రోఫీలోని అన్ని మ్యాచ్‌లు దుబాయ్ లేదా శ్రీలంకలో జరగొచ్చు. పోటీలో చివరి నాలుగుకు చేరుకోవడంలో భారత్ విజయవంతమైతే మార్చి 4న సెమీఫైనల్‌, మార్చి 9న టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

రెండు గ్రూపులుగా జట్లు

గ్రూప్ A (భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్)
గ్రూప్ B (ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్)

Also Read: Discovery Lookback 2024 : ఈ సంవత్సరం మహిళల హృదయాలను గెలుచుకున్న కిచెన్ హ్యాక్స్..!

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వివరాలు

ఫిబ్రవరి 19: పాకిస్థాన్ vs న్యూజిలాండ్ (కరాచీ)
20 ఫిబ్రవరి: టీమిండియా vs బంగ్లాదేశ్ (తటస్థం)
21 ఫిబ్రవరి: ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా (కరాచీ)
22 ఫిబ్రవరి: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (లాహోర్)
23 ఫిబ్రవరి: భారతదేశం vs పాకిస్తాన్ (తటస్థం)
ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి)
25 ఫిబ్రవరి: ఆస్ట్రేలియా vs. సౌతాఫ్రికా (రావల్పిండి)
26 ఫిబ్రవరి: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ (లాహోర్)
27 ఫిబ్రవరి: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి)
ఫిబ్రవరి 28: ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)
1 మార్చి: ఇంగ్లాండ్ vs. సౌతాఫ్రికా (కరాచీ)
మార్చి 2: భారత్ vs న్యూజిలాండ్ (తటస్థం)
4 మార్చి: సెమీ-ఫైనల్ 1 (న్యూట్రల్)
మార్చి 5: సెమీఫైనల్ 2 (లాహోర్)
మార్చి 9: ఫైనల్, (న్యూట్రల్/లాహోర్)

నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే: భారతదేశం నాకౌట్ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికలో ఆడుతుంది. అయితే భారత్ ఫైనల్‌కు చేరుకోలేకపోతే ఈ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది. అన్ని నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేని కేటాయించారు.