ICC Bans Shohely Akhter: బంగ్లాదేశ్ మ‌హిళా క్రికెట‌ర్‌కు ఊహించ‌ని షాక్‌.. ఐదేళ్లపాటు నిషేధం!

బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. అవినీతి ఆరోపణలపై నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌గా బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ షోహైలీ అక్తర్ నిలిచింది.

Published By: HashtagU Telugu Desk
ICC Bans Shohely Akhter

ICC Bans Shohely Akhter

ICC Bans Shohely Akhter: అవినీతి ఆరోపణలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిషేధించిన మొదటి మహిళా క్రికెటర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన షోహైలీ అక్తర్ (ICC Bans Shohely Akhter) మంగళవారం చెత్త రికార్డు సృష్టించింది. 2023 టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినందుకు ఆమె దోషిగా తేలింది.

బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. అవినీతి ఆరోపణలపై నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌గా బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ షోహైలీ అక్తర్ నిలిచింది. రెండు ODIలు, 13 T20 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. ఫిక్సింగ్‌కు ప్రయత్నించడం, లంచం ఇవ్వడం, ICC అవినీతి నిరోధక కోడ్ (ACU)కి పూర్తి సంప్రదింపు సమాచారాన్ని అందించడంలో విఫలమవడం, అలాగే దర్యాప్తును అడ్డుకోవడం వంటి నేరాలకు పాల్పడింది. అవినీతి నిరోధక కోడ్‌లోని ఐదు నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించడంతో ఆమె ఐదేళ్ల పాటు క్రికెట్‌లోని అన్ని రకాల నిషేధానికి గురైంది.

Also Read: MLC Election Nominations: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి.. 32 తిరస్కరణ!

2023 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆమె ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 36 ఏళ్ల అక్తర్ ఆ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ ప్లేయింగ్ స్క్వాడ్‌లో భాగం కాదు. చివరిగా అక్టోబర్ 2022లో ఆడింది. ఫిబ్రవరి 14, 2023న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న రోజు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో క్రికెటర్‌తో షోహైలీ సంభాషణపై ACU విచారణ దృష్టి సారించింది.

ముప్పై ఆరేళ్ల షోహైలీపై ఐదేళ్ల నిషేధం

ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే షోహెలీ బంగ్లాదేశ్ తరఫున రెండు వన్డేలు, 13 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీ సందర్భంగా ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌లోని ఐదు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆమె అంగీక‌రించింది. మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల సందర్భంగా అవినీతి పరిచయాలకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. షోహైలీ కోడ్ రూల్స్ 2.1.1, 2.1.3, 2.1.4, 2.4.4, 2.4.7 ఉల్లంఘించిన ఆరోపణలను అంగీక‌రించింది. దీంతో 10 ఫిబ్రవరి 2025 నుండి ఐదేళ్ల నిషేధం విధించింది ఐసీసీ.

 

  Last Updated: 11 Feb 2025, 10:48 PM IST