Site icon HashtagU Telugu

Harbhajan Singh : ఐసీసీ ప్రశ్నకు భజ్జీ రిప్లై

harbhajan singh

harbhajan singh

భారత్ , ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టుకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉన్న టీమిండియాకు రోహిత్ శర్మ కరోనా బారిన పడడం షాకే. దీంతో మ్యాచ్ ఆరంభ సమయానికి అతను కోలుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ కు బ్యాకప్ ఓపెనర్ గా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే మయాంక్‌ అగర్వాల్‌ను పిలిపించింది. రోహిత్ అందుబాటులో లేకుంటే మయాంక్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయం. అయితే రోహిత్ స్థానంలో జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోహ్లీ , పంత్ , బుమ్రా పేర్లు రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మాజీలు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఒకరు రిషబ్‌ పంత్ అని, మరొకరు బుమ్రా అని అంటుండగా.. ఇదొక్క మ్యాచ్‌కు విరాట్‌ కోహ్లికి అప్పగిస్తే తప్పేంటని మరికొందరు ఈ నేపథ్యంలో ఇదే ప్రశ్నను ఐసీసీ అభిమానులను అడిగింది. రోహిత్‌ ఆడలేకపోతే కెప్టెన్‌గా ఎవరుంటారు అని ట్వీట్‌ చేసింది. దీనిపై మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ స్పందించాడు. భజ్జీ సింపుల్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రాను ట్యాగ్‌ చేశాడు. రోహిత్‌ ఆడకపోతే బుమ్రాకే కెప్టెన్సీ ఇవ్వాలని భజ్జీ ఈ రిప్లైతో తేల్చేశాడు. ప్రస్తుతం బుమ్రా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఒకవేళ రోహిత్ కోలుకోకుంటే బూమ్రాకే పగ్గాలు అప్పగించే అవకాశముంది. ఇదే జరిగితే దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత భారత కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న తొలి పేసర్​గా బుమ్రా నిలవనున్నాడు. గతంలో కపిల్ దేవ్ మాత్రమే భారత సారథిగా వ్యవహరించిన పేసర్ గా నిలిచాడు. అనంతరం భారత కెప్టెన్సీ పగ్గాల ఎక్కువగా బ్యాటర్లకే వస్తున్నాయి. ఒకవేళ బుమ్రాకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తే అరుదైన రికార్డు సాధించనున్నాడు.