Site icon HashtagU Telugu

Champions Trophy: హైబ్రిడ్ మోడ‌ల్‌లోనే ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. పాక్ కూడా కీల‌క‌ డిమాండ్‌!

PCB Chairman

PCB Chairman

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy) హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించ‌నున్నారు. ఐసీసీ, పీసీబీ మధ్య డీల్‌ కుదిరింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షరతులను ఐసీసీ కూడా అంగీకరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టోర్నీ నిర్వహించాల్సి ఉంది. 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్ జట్టు కూడా భారత్‌కు రావడం లేదు. కొలంబో వేదికగా పాకిస్థాన్ తన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్లేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దీని తరువాత పొరుగు దేశం దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నమెంట్ నిర్వహించడానికి నిరాకరించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌ విధానంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదం తెలిపింది. పీసీబీ, బీసీసీఐల మధ్య ఒప్పందం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్నాయి. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది.

Also Read: Allu Arjun Bail Conditions: అల్లు అర్జున్‌కు బెయిల్.. కోర్టు విధించిన ష‌ర‌తులివే!

ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో ఆడతారు

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు పూర్తయ్యాయి. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు. ఆజ్ తక్ స్పోర్ట్స్ ఎడిటర్ విక్రాంత్ గుప్తా ట్వీట్ ప్రకారం.. టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. 2026లో జరిగే టీ-20లో పాకిస్థాన్ జట్టు పాల్గొనేందుకు పీసీబీ ఓకే చెప్పింది. అయితే 2026లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారత్ రాదు. పాక్‌ తన మ్యాచ్‌లను శ్రీలంకలోని కొలంబో నగరంలో ఆడనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు మొండిచేయి విడిచి ఐసీసీ నిర్ణయానికి అంగీకరించింది.

పీసీబీ ప‌ట్టు విడిచింది

టీం ఇండియాను పాకిస్థాన్‌కు పంపకూడదన్న బీసీసీఐ నిర్ణయాన్ని పీసీబీ తీవ్రంగా ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే, ఎట్టకేలకు ఐసీసీ, బీసీసీఐల ముందు పీసీబీ ఓటమిని అంగీకరించింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్ణయించటంతో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను కూడా త్వరలో ప్రకటించే అవ‌కాశం ఉంది. ఫిబ్రవరి నెలాఖరులో టోర్నీ ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి చివరిసారిగా 2017లో ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వగా, పాకిస్థాన్ జట్టు భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.

 

Exit mobile version