world cup 2023: వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ (AUS vs AFG) జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ పరుగుల వరద పారించాడు. ఆరంభంలో వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురవ్వకుండా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పెంచాడు. జద్రాన్ 143 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ జద్రాన్ 8 ఫోర్లు 3 సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇబ్రహీం జద్రాన్ సెంచరీ తో ఆఫ్ఘానిస్తాన్ తరుపున తొలి సెంచరీ నమోదైంది. ఇన్నింగ్స్ లో అఫనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్న జద్రాన్..ఇన్నింగ్స్ ఆకట్టుకుంది.
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా మరియు జోష్ హేజిల్‌వుడ్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ మరియు నవీన్ ఉల్ హక్.
Also Read: BC Atma Gourava Sabha : బిజెపి -జనసేన కార్యకర్తలతో జనసంద్రంగా మారిన LB స్టేడియం