Shahid Afridi: టీమిండియాని పాకిస్తాన్‌కి పంపండి పీఎం సాబ్.. ప్రధాని మోదీని కోరిన షాహిద్ అఫ్రిది..!

ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని పీసీబీ పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (Shahid Afridi) భారత ప్రధాని నరేంద్ర మోడీని చాలా ప్రేమగా, కొంత ఫన్నీగా, మిస్టర్ మోడీ క్రికెట్‌ను అనుమతించాలని అభ్యర్థించాడు.

  • Written By:
  • Updated On - March 22, 2023 / 07:38 AM IST

ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌పై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే 2023 ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించబోదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేశారు. BCCI ఈ వైఖరి తరువాత ఆసియా కప్‌ను వేరే చోటికి మార్చవచ్చు. అయితే ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని పీసీబీ పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (Shahid Afridi) భారత ప్రధాని నరేంద్ర మోడీని చాలా ప్రేమగా, కొంత ఫన్నీగా, మిస్టర్ మోడీ క్రికెట్‌ను అనుమతించాలని అభ్యర్థించాడు.

అఫ్రిది మాట్లాడుతూ, “పాకిస్తాన్‌లో భద్రతకు సంబంధించినంతవరకు ఇటీవల చాలా అంతర్జాతీయ జట్లు మమ్మల్ని సందర్శించాయి. మేము భారతదేశంలో కూడా భద్రతా ముప్పును ఎదుర్కొంటాము. అయితే ఇరుదేశాల ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే పర్యటన సాగుతుంది. దీని తర్వాత, మోడీ సాబ్ క్రికెట్ జరగనివ్వండి అని చాలా ప్రేమగా, కొంత ఫన్నీ టోన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీని అఫ్రిది అభ్యర్థించాడు.

Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ పై దినేష్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?

‘స్పోర్ట్స్ టాక్’లో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. “మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే, అతను మనతో మాట్లాడకపోతే, దాని గురించి మనం ఏమి చేయగలం? బీసీసీఐ బలమైన బోర్డు అనడంలో సందేహం లేదు. మీరు బలంగా ఉన్నప్పుడు, మీకు మరింత బాధ్యత ఉంటుంది. ఎక్కువ మంది శత్రువులను సంపాదించడానికి ప్రయత్నించవద్దు. మీరు స్నేహితులను చేసుకోవాలి. ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోవడం మిమ్మల్ని బలపరుస్తుందని బీసీసీఐని ఉద్దేశించి మాట్లాడాడు. పాక్ క్రికెట్ బోర్డు వీక్ అని, బలహీనమైనదని నేను అనడం లేదు. అయితే పీసీబీకి కూడా బీసీసీఐ నుంచి నిధులు అందుతున్నాయనే విషయం మరిచిపోకూడదు. ఇద్దరి మధ్య రాజీ కుదరాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలని అన్నారు.