Site icon HashtagU Telugu

Kapil Dev : క్రికెట్ పెద్దలు బిజీ.. ఫైనల్‌కు నన్ను పిలవలేదు : కపిల్ దేవ్

Kapil Dev

Kapil Dev

Kapil Dev :  ‘‘టీమిండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు రావాలని నన్ను ఎవరూ పిలవలేదు. అందుకే ఆ మ్యాచ్‌కు వెళ్లలేదు’’ అని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు.  అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్ చూసేందుకు రావాలని తనను బీసీసీఐ ఆహ్వానించలేదని ఆయన వెల్లడించారు. ‘‘1983లో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులందరినీ ఫైనల్ కు పిలుస్తారని భావించాను. అయితే క్రికెట్ పెద్దలు ఎంతో బిజీగా ఉండడం వల్ల మాలాంటి వాళ్లను మర్చిపోయి ఉంటారు’’ అని కపిల్ దేవ్ కామెంట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మెగా ఫైనల్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసిన బీసీసీఐ.. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లను దీనికి ప్రత్యేకంగా ఆహ్వానించిందని వార్తలు వచ్చాయి. ఆహ్వానం పంపిన జాబితాలో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్(1975, 1979) కపిల్ దేవ్(1983), అలన్ బోర్డర్(1987), అర్జున రణతుంగ(1996), స్టీవ్ వా(1999), రికీ పాంటింగ్(2003,2007) ఎంఎస్ ధోనీ(2011), మైఖేల్ క్లార్క్(2015), ఇయాన్ మోర్గాన్(2019) ఈ లిస్టులో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే వీరిలో బీసీసీఐ ఎంతమందిని పిలిచిందో పక్కాగా తెలియదు కానీ.. కపిల్ కు మాత్రం ఆహ్వానం అందలేదని ఇప్పుడు తేలిపోయింది. 1983 ముందు వరకు క్రికెట్ ప్రపంచంలో అనామక జట్టుగా ఉన్న భారత్‌కు ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్‌ను.. వరల్డ్ కప్ ఫైనల్‌కు పిలవకపోవడం బీసీసీఐ వ్యాపారంపై ఫోకస్ చేస్తోందనేందుకు సంకేతంగా పరిశీలకులు(Kapil Dev) అభివర్ణిస్తున్నారు.

Also Read: Whats Today : అమిత్ షా, గడ్కరీ, నిర్మల సుడిగాలి పర్యటన.. ఖమ్మంలో అజారుద్దీన్ ప్రచారం