Site icon HashtagU Telugu

world cup 2023: రోహిత్ ఆటకు నా సెల్యూట్

Kaif Optimized

Kaif Optimized

world cup 2023: ముగిసిన ప్రపంచకప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. దూకుడుగా ఆడుతూ శుభారంభం అందించాడు. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించి 31 బంతుల్లో 47 పరుగులు చేశాడు. రోహిత్ మొత్తం 597 పరుగులు చేసి టోర్నీలో టాప్-2 స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తూ ఫైనల్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియాను అభినందించాడు.

ప్రపంచ కప్ గెలిచినందుకు ఆస్ట్రేలియాకు అభినందనలు. కానీ భారత జట్టు అత్యుత్తమ జట్టు అని అన్నారు. టీమిండియా ఓడిపోయినప్పటికీ అదే ఆస్ట్రేలియా జట్టుపై భారత్ చాలాసార్లు గెలిచింది. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో రికీ పాంటింగ్ భారత్‌పై సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆ జట్టులో నేను కూడా ఉన్నాను. అప్పుడు కూడా మేము చాలా బాధపడ్డాము. కాబట్టి రోహిత్ శర్మ ప్రస్తుతం ఏమని భావిస్తున్నాడో నేను అర్థం చేసుకోగలను. భవిష్యత్తులో ఎం జరుగుతుందో తెలియదు. కానీ ఈ ప్రపంచకప్‌లో భారత జట్టును చూసి గర్వంతో నా ఛాతీ ఉప్పొంగుతుంది. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ప్రదర్శనకు సెల్యూట్ చేస్తున్నాను అని కైఫ్ అన్నాడు.

Also Read: BRS Public Meeting At Madhira : కాంగ్రెస్ పార్టీ కి 20 సీట్లు కూడా కష్టమే – కేసీఆర్