Site icon HashtagU Telugu

Rohit Sharma: నాకు రికార్డుల కంటే జట్టు విజయం ముఖ్యం

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: క్రికెట్లో ఆటగాళ్లు సాధించిన రికార్డుల గురించి మరో వందేళ్లు చర్చించుకుంటారు. ప్రస్తావన వచ్చిన ప్రతి సారి రికార్థుల గురించి చర్చిస్తారు. మీడియా , పేపర్ వాళ్ళు కూడా క్రికెటర్స్ రికార్డుల గురించి కథలు కథలుగా విశ్లేశిస్తుంటారు. అయితే రికార్డులు ఎవడికి కావాలి, మైల్ స్టోన్స్ తో పనేముంది అనే ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ.

హిట్ మ్యాన్ తన క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. తన అసాధారణ ప్రతిభతో అనేక మ్యాచ్ లను గెలిపించాడు. కానీ రోహిత్ రికార్డుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతీ సారి దాటవేస్తుంటాడు. తాజాగా మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. ప్రత్యేకంగా నిలవాలని ఏనాడూ కోరుకోలేదు. ఆడిన ప్రతీ మ్యాచ్, ప్రతీ మూమెంట్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటా. ఆడినంత కాలం మధురానుభూతులను సంపాదించుకోవడంపై ఫోకస్ పెడుతా. ఎన్ని పరుగులు చేశా.. ఎన్ని మ్యాచ్‌లు ఆడా అనే లెక్కలు నాకు అవసరం లేదు.

మైల్​స్టోన్స్, రికార్డ్స్, స్టాటిస్టిక్స్ ఇలాంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్ల కంటే టీమ్ విజయమే ముఖ్యమన్నాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి గోల్ ఒకటే, వ్యక్తిగత రికార్డుల కంటే విజయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని స్పష్టం చేశాడు. రోహిత్ 2019 వన్డే వరల్డ్ కప్​లో ఏకంగా 5 సెంచరీలు బాదాడు. 2023 సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా నిలిచాడు. ఆ ఏడాది మొత్తం మీద 479 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. 573 సిక్సర్లు కొట్టాడు. అంతకుముందు ఈ రికార్డ్ వెస్టిండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. 551 ఇన్నింగ్స్‌లల్లో గేల్ 553 సిక్సర్లు కొట్టాడు. అంత‌ర్జాతీయ‌ టీ20 క్రికెట్‌లో హ‌య్యెస్ట్ సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా రోహిత్ నిలిచాడు. అప్ఘానిస్తాన్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూప‌ర్ సెంచ‌రీతో రోహిత్‌ కెరీర్లో ఐదో టీ20 సెంచ‌రీ నమోదు చేశాడు. మూడు సార్లు వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు, టెస్ట్ ఫార్మెట్లో ట్రిపుల్ సెంచరీ నెలకొల్పాడు.

Also Read: Telangana ACB: ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ

Exit mobile version