Site icon HashtagU Telugu

Kohli Captaincy: కోహ్లీని నేను తప్పించలేదు: సౌరవ్ గంగూలీ

Kohli Captaincy

Kohli Captaincy

Kohli Captaincy: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి అకస్మాత్తుగా తప్పుకోవడం అప్పట్లో పెద్ద దుమారం రేగింది. కోహ్లీకి బీసీసీఐ పెద్దల మధ్య వివాదాలున్నట్లు వార్తలు వ్యాపించాయి. ముఖ్యంగా గంగూలీ స్వయంగా కలుగజేసుకుని కోహ్లీని తప్పించాడన్న కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ బీసీసీఐపై దారుణంగా మండిపడ్డారు. ఈ పరిణామంలో అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని సూత్రధారిగా పేర్కొన్నారు.

ఈ వివాదంపై తాజాగా సౌరవ్ గంగూలీ తన మౌనాన్ని వీడి కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గంగూలీ ప్రకటనతో మరోసారి ఈ వివాదాస్పద అంశం చర్చనీయాంశమైంది. కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంలో తన ప్రమేయం ఏమీ లేదని గంగూలీ మరోసారి చెప్పుకొచ్చాడు. తాను కోహ్లీని టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగించలేదని తెలిపాడు.అప్పటికే టి20 కెప్టెన్సీ నుండి తప్పుకున్న కోహ్లీనీ టెస్ట్ ల నుండి కూడా తప్పుకుంటే బాగుంటుంది అని కోరుకున్నాను కానీ అతన్ని తప్పించ లేదని తెలిపాడు.కెప్టెన్సీ వదులు కోవడం కోహ్లీ నిర్ణయం అని దాదా చెప్పుకొచ్చాడు.

Also Read: Tech Tips: మీ ఫోన్ లో బ్యాటరీ త్వరగా అయిపోతోందా.. అయితే ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే చాలు?