Champions Trophy: చాలా కాలం తర్వాత ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) పాకిస్థాన్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అంచనాల రౌండ్ జరుగుతోంది. ఇక్కడ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టోర్నమెంట్ గురించి పెద్ద అంచనా వేసి సెమీ-ఫైనల్‌కు పోటీపడే నాలుగు జట్లను పేర్కొన్నాడు. ఈ నాలుగు జట్లలో భారత్, పాకిస్థాన్‌లను కూడా చేర్చాడు.
‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’గా ప్రసిద్ధి చెందిన అక్తర్ ఆస్ట్రేలియాను మొదటి నాలుగు జట్లలో పోటీదారుగా పరిగణించలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోగలదని పేర్కొన్నాడు. ICC ODI వరల్డ్ కప్ 2023లో టాప్ 8 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. దాదాపు 3 దశాబ్దాల తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్తాన్ వెళ్ళడానికి నిరాకరించింది. దీంతో భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో ఆడనుంది.
Also Read: Virat Kohli Record: కటక్‌లో రెండో వన్డే.. ఈ గ్రౌండ్‌లో విరాట్ రికార్డు ఎలా ఉందంటే?
సెమీ-ఫైనల్‌కు చేరుకునే జట్లలో అక్తర్ వన్డే ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఎంపిక చేయలేదు. బదులుగా అతను ఆశ్చర్యకరమైన వైల్డ్‌కార్డ్ ఎంపికను ఎంచుకున్నాడు. అఫ్గానిస్థాన్ పరిణితి కనబరిస్తే టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకోగలదని అతను అభిప్రాయపడ్డాడు. దాదాపు ప్రతి ICC టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆశ్చర్యకరమైన ప్రతిభను కనబరుస్తున్న విషయం తెలిసిందే. తరచుగా జెయింట్ కిల్లర్ అని పిలువబడే ఆఫ్ఘనిస్తాన్ గత కొన్ని సంవత్సరాలలో అనేక శక్తివంతమైన జట్లను ఓడించింది. 2023 ODI ప్రపంచ కప్‌లో ఆ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. 2023 ప్రపంచ కప్‌లో జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.
ఫిబ్రవరి 23న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో తమ జట్టు విజయం సాధించవచ్చని అక్తర్ అంచనా వేశాడు. ఫైనల్‌లో ఇరు జట్లు మరోసారి తలపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ భారత్‌ను ఓడిస్తుందని ఆశిస్తున్నా’ అని అక్తర్ అన్నారు. టోర్నీ ఫైనల్‌లోనూ పాకిస్థాన్, భారత్‌లు తలపడాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఎడిషన్‌లో ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో భారతదేశం- పాకిస్థాన్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 180 పరుగుల తేడాతో పాక్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.