Prithvi Shaw: రన్స్ చేస్తున్నా ఛాన్స్ రావడం లేదు : పృథ్వీ షా

భారత యువ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిలకడగా రాణిస్తున్నా అవకాశాలు రావడం లేదంటూ పరోక్షంగా

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 05:28 PM IST

భారత యువ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిలకడగా రాణిస్తున్నా అవకాశాలు రావడం లేదంటూ పరోక్షంగా సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు. బ్యాటర్ గా రన్స్ చేయ‌డం ముఖ్యమ‌ని, ఆ విష‌యంలో తాను ప్ర‌తి సారి నిరూపించుకుంటూనే ఉన్నానన్నాడు. అయినప్పటీ త‌న‌ను ప‌క్క‌న‌పెడుతున్నార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించాడు. సెలెక్ల‌ర్ల‌కు త‌న‌పై న‌మ్మ‌కం క‌లిగిన‌ రోజే అవ‌కాశం ఇస్తార‌న్న‌ది తెలుస్తోందని, అప్ప‌టివ‌ర‌కు కష్టపడుతూనే ఉంటాన‌ని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంపైనే దృష్టిపెడుతున్న‌ట్లు చెప్పాడు. ఐపీఎల్ త‌ర్వాత ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇచ్చానని,. దాదాపు ఎనిమిది కిలోల బ‌రువు త‌గ్గాన‌ని చెప్పుకొచ్చాడు. దీని కోసం తన డైట్ ప్లాన్ పూర్తిగా మార్చుకున్నానని తెలిపాడు. చైనీస్ ఫుడ్, స్వీట్లు వంటివి తినడం లేదన్నాడు. ఆట‌లో టెక్నిక్ మార్చుకునేందుకు కూడా ఎక్కువగానే ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు చెప్పాడు.

పృథ్వీ షా జాతీయ జట్టుకు టెస్టుల్లో రెండేళ్ల క్రితం చివ‌రిసారిగా ఆడాడు. గ‌త ఏడాది జూలైలో శ్రీలంక‌పై చివ‌రి వ‌న్డే మ్యాచ్ ఆడిన ఈ యువ ఆటగాడు త‌ర‌చుగా గాయాల బారిన ప‌డ‌టం, ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల కార‌ణంగా జట్టులో చోటు కోల్పోయాడు. సూర్య‌కుమార్ యాద‌వ్‌, దీప‌క్ హుడాతో పాటు ప‌లువురు యువ క్రికెటర్లు నిలకడగా రాణిస్తుండడం కూడా షాకు చోటు దక్కడం లేదు. ప్రస్తుతం టీమిండియా ప్రతీ స్థానానికీ కనీసం ముగ్గురు పోటీపడుతుండగా.. ఫిట్ నెస్ సమస్యలు లేని క్రికెటర్లకే బీసీసీఐ సెలక్టర్లు ప్రాధాన్యతనిస్తున్నారు. కాగా జట్టులో ప్లేస్ కు సంబంధించి ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని ఉన్నప్పటకీ పృథ్వీ షా కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.