ప్రపంచ క్రికెట్ లో రికార్డుల రారాజు. కింగ్ కోహ్లీ (Virat Kohli) ఫుల్ ఖుషీలో ఉన్నాడు. దాదాపు మూడున్నరేళ్ళ తర్వాత శతకం సాధించిన విరాట్ ఇవాళ తన ఐదో వివాహ వార్షికోత్సవాన్ని (5th Anniversary) జరుపుకుంటున్నాడు. సరిగ్గా ఒకరోజు ముందు సెంచరీ దాహం తీర్చుకున్న కోహ్లీ ఇన్ స్టా (Virat Kohli Instagram) వేదికగా తన శ్రీమతి అనుష్క శర్మ (Anushka Sharma) పై ప్రేమను చాటుకుంటూ భావోద్వేగపు పోస్ట్ పెట్టాడు. శాశ్వతమైన ప్రయాణంలో 5 సంవత్సరాలు గడిచాయి. నేను నిన్ను పొందడం నా జన్మ ధన్యంగా భావిస్తున్నా. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. అంటూ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టాడు. ఇందుకు అనుష్క శర్మ (Anushka Sharma) కూడా స్పందించింది. థ్యాంక్ గాడ్.. ఇంకా నువ్వు తిరిగి రుణం తీర్చుకుంటాననలేదు అంటూ రిప్లై ఇచ్చింది.
5 years on a journey for eternity. How blessed Iam to find you , I love you with all my heart ❤️♾️❤️♾️❤️ pic.twitter.com/PISyxaDD6S
— Virat Kohli (@imVkohli) December 11, 2022
భారత క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే రికార్డులకు చిరునామాగా మారిపోయిన విరాట్ కోహ్లీ టీమిండియాకు సారథ్యం వహించాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడి నుంచి బయటపడి వ్యక్తిగత బ్యాటింగ్ పై దృష్టి పెట్టేందుకు గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత సారథ్యానికి గుడ్ బై చెప్పాడు. గత మూడున్నరేళ్ళుగా సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ ఇప్పుడు బంగ్దాదేశ్ పై చివరి వన్డేలో శతకం సాధించాడు. 2017లో అనుష్కను వివాహమాడిన కోహ్లీ జంటకు వామికా పుట్టింది. సిరీస్ లు లేనప్పుడు కుటుంబంతో విహారయాత్రలు చేస్తూ టైమ్ ఆస్వాదిస్తున్న విరాట్ ప్రస్తుతం బంగ్లాదేశ్ టూర్ టెస్ట్ సిరీస్ కు రెడీ అయ్యాడు.
Also Read: Bangladesh vs India : జడేజా, షమీ ఔట్. తొలి టెస్టుకు రోహిత్ దూరం