Site icon HashtagU Telugu

India vs New Zealand: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో మ్యాచ్..!

India Vs New Zealand

Ind Vs Nz Imresizer

తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 18న న్యూజిలాండ్- టీమిండియా (India vs New Zealand) మధ్య జరిగే మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ వైజాగ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పర్యటన, షెడ్యూల్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో న్యూజిలాండ్ (India vs New Zealand) టూర్ ఖరారైంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జనవరి 18న హైదరాబాద్‌లో జరగనుండగా, రెండో మ్యాచ్‌ జనవరి 21న నాగ్‌పూర్‌లో జరగనుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే జనవరి 24న ఇండోర్‌లో జరగనుంది.

వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో న్యూజిలాండ్ జట్టు భారత జట్టుతో మూడు మ్యాచ్‌ల ODI సిరీస్, T20 సిరీస్‌ను ఆడుతుంది. న్యూజిలాండ్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. న్యూజిలాండ్ జట్టు పర్యటన జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 1న జరుగుతుంది.న్యూజిలాండ్ జట్టు భారత పర్యటన మూడు వన్డేల సిరీస్‌తో ప్రారంభం కానుంది.

Also Read: TRS TO BRS: కేసీఆర్ కు గుడ్ న్యూస్. ‘బీఆర్ఎస్’ గా మారిన ‘టీఆర్ఎస్’..!

జనవరి 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లోని రెండో వన్డే రాయ్‌పూర్‌లో జనవరి 21న జరగనుండగా, సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఇండోర్‌లో జరగనుంది. బీసీసీఐ రొటేషన్ విధానం ప్రకారం ఈ ఏడాది ఇండోర్‌లో వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండగా ఆతిథ్య మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) ఏకకాలంలో రెండు మ్యాచ్‌లు నిర్వహించేందుకు సుముఖంగా లేదు.

జనవరి 27న భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ రాంచీలో జరగనుంది. టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 29న లక్నోలో జరగనుంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇటీవల ఇరుజట్ల మధ్య టీ20, వన్డే సిరీస్ లు జరిగిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకోగా.. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.