Hyderabad: పాకిస్థాన్ టీమ్ ఉన్న హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు మళ్ళీ హైదరాబాద్ ని వీడే వరకు హైదరాబాద్ పోలీసులు ఓవర్ టైం చేయాల్సి వస్తుంది.

Hyderabad: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు మళ్ళీ హైదరాబాద్ ని వీడే వరకు హైదరాబాద్ పోలీసులు ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. నిన్న బుధవారం నగరంలో అడుగుపెట్టిన పాక్ జట్టును కట్టుదిట్టమైన భద్రత మధ్య నగరం నడిబొడ్డున ఉన్నప్రముఖ హోటల్‌కు తరలించారు. దాదాపు రెండు వారాల పాటు పాకిస్థాన్ టీమ్ ఇక్కడే ఉంటుంది. శుక్రవారం జరిగే వార్మప్ మ్యాచ్ కు స్టేడియంలో దాదాపు 200 మంది పోలీసులు అవసరం కాగా, అక్టోబర్ 3న ప్రేక్షకులు జరిగే వార్మప్ మ్యాచ్ కు అదనంగా 800 మంది పొలుసులు భద్రత కల్పిస్తారు. చాలా కాలం తర్వాత పాకిస్థాన్ ఇక్కడకు రావడంతో, అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నగర పోలీసులు.

మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా వన్డే మహా సంగ్రామానికి తెర లేవనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో10 జట్లు తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. ఈసారి జరిగే వన్డే ప్రపంచకప్ లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు హాట్ ఫేవరేట్స్ గా కనిపిస్తున్నాయి. కాగా ప్రపంచ కప్ లో తలపడే ముందు వార్మప్ మ్యాచులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచుల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న జరగనున్న మొదటి వామప్ మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజిల్యాండ్ జట్లు తలపడతాయి.

ఐసీసీ వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్ లో కాలుమోపింది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో నిన్న బుధవారం బాబర్ సేన హైదరాబాద్ చేరుకుంది. లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ మీదుగా భారత్ కి వచ్చారు. పాకిస్థాన్ టీమ్ హైదరాబాద్ కు వస్తున్న కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పాక్ ఆటగాళ్లను ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వారికి కేటాయించిన హోటల్ కు తరలించారు.

Also Read: Mega Fans: 16 ఏళ్లు పూర్తి చేసుకున్న రామ్ చరణ్, జోష్ లో మెగా ఫ్యాన్స్!