ICC Team: ఐసీసీ వన్డే టీమ్ లో హైదరాబాదీ పేసర్

ఐసీసీ టీ ట్వంటీ టీమ్ లో సత్తా చాటిన భారత క్రికెటర్లు వన్డే టీమ్ లోనూ చోటు దక్కించుకున్నారు.

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 09:41 PM IST

ICC Team: ఐసీసీ టీ ట్వంటీ టీమ్ లో సత్తా చాటిన భారత క్రికెటర్లు వన్డే టీమ్ లోనూ చోటు దక్కించుకున్నారు. 2022కు సంబంధించి ఐసీసీ వన్డే టీమ్ ది ఇయర్ లో ఇద్దరు భారత ఆటగాళ్లు ఎంపికయ్యారు. మిడిలార్డర్ లో శ్రేయస్ అయ్యర్, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ లకు ఈ వన్డే టీమ్ లో చోటు దక్కింది. ఇక న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, వెస్టిండీస్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, జింబాబ్వే, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. 2022లో నిలకడగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. మిడిలార్డర్ లో నమ్మదిగన బ్యాటర్ గా ఎదిగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 17 వన్డేల్లో 724 రన్స్ చేశాడు. అతని సగటు 55 కాగా.. ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు.

మరో టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్ కూడా ఈ వన్డే టీమ్ ఆఫ్ 2022లో చోటు దక్కించుకున్నాడు. గతేడాది బుమ్రా గాయం కారణంగా చాలా వరకూ టీమ్ కు దూరంగా ఉండటంతో ఆ అవకాశాన్ని సిరాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. ఈ హైదరాబాదీ పేసర్ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్న బాబర్ ఆజమ్‌ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. బాబర్ ఆజమ్ ఈ ఏడాది 84.87 సగటుతో వన్డేల్లో 679 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌తో పాటు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాకి చోటు దక్కింది. ట్రెంట్ బౌల్ట్ గత ఏడాది 6 వన్డేల్లో 18 వికెట్లు పడగొట్టగా ఆడమ్ జంపా, 2022లో 12 మ్యాచుల్లో ఏకంగా 30 వికెట్లు తీసి అదరగొట్టాడు

ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, షై హోప్, శ్రేయాస్ అయ్యర్, టామ్ లాథమ్, సికిందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జెరీ జోసఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా