Site icon HashtagU Telugu

IPL 2022 : ఇవాల్టి మ్యాచ్ లో ఆటగాళ్ళను ఊరిస్తున్న రికార్డులివే

Ipl 2022 Csk Vs Kkr

Ipl 2022 Csk Vs Kkr

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఐదో మ్యాచ్‌లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయాల్స్ జట్లు తలపడనున్నాయి. మహారాష్ట్రలోనిఎంసీఏ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేన్ విలియంసన్ సారథిగా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టును యువ సంచలనం సంజు శాంసన్ ముందుండి నడిపించనున్నారు. ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటివరకు 15 సార్లు తలపడగా, సన్ రైజర్స్ 8, రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 సందర్భాల్లో విజయాలు సాధించాయి. ఇక, నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్ లోరాజస్థాన్ రాయల్స్ సీనియర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఈ మ్యాచ్‌లో మరో 32 పరుగులు చేస్తే ఐపీఎల్‌ 2000 పరుగుల క్లబ్‌లో చేరతాడు.అలాగే సన్ రైజర్స్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్‌లో మ‌రో 5 సిక్సులు బాదితే టీ20 ఫార్మాట్‌లో 300 సిక్సులు పూర్తి చేసుకుంటాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో మరో 5 వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో 150 వికెట్ల క్లబ్ లో చేరతాడు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భావనేశ్వర్ కుమార్ మరో 8 వికెట్లు పడగొడితే ఐపీఎల్‌లో 150 వికెట్లమైలురాయిని చేరుకుంటాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఎంసీఎ స్టేడియం బ్యాటర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ వైపే మొగ్గుచూపుతుందని తెలుస్తోంది.

Exit mobile version